Neeraj Chopra: డైమండ్ లీగ్ లో నీరజ్ గోల్డెన్ త్రో

భారత్ జావెలిన్ స్టార్ అథ్లెట్ నీరజ్ చోప్రా మరోసారి అంతర్జాతీయ స్థాయిలో అదరగొట్టాడు.

  • Written By:
  • Publish Date - September 9, 2022 / 10:17 AM IST

భారత్ జావెలిన్ స్టార్ అథ్లెట్ నీరజ్ చోప్రా మరోసారి అంతర్జాతీయ స్థాయిలో అదరగొట్టాడు. ప్రతిష్ఠాత్మక డైమండ్ లీగ్ లో ట్రోఫీ గెలిచిన తొలి భారత అథ్లెట్ గా చరిత్ర సృష్టించాడు. ఈటెను 88.34 మీటర్ల దూరం విసిరి తొలి స్థానంలో నిలిచాడు. నిజానికి తొలి ప్రయత్నంలో నీరజ్‌ చోప్రా ఫౌల్‌ చేసి డిస్‌క్వాలిఫై అయ్యాడు. అయితే రెండో ప్రయత్నంలో ఈటెను 88.44 మీటర్లు దూరం విసిరాడు. మూడో ప్రయత్నంలో​ 88 మీటర్లు, నాలుగో ప్రయత్నంలో 86.11 మీటర్లు, చివరి ప్రయత్నంలో 87 మీటర్లు విసిరాడు. మరోవైపు నీరజ్‌తో పోటీ పడిన మిగిలిన ఐదుగురు అతని దగ్గరికి కూడా రాలేకపోయారు.
చెక్ రిపబ్లిక్‌కు చెందిన ఒలింపిక్ రజత పతక విజేత జాకుబ్ వడ్లెజ్చ్ 86.94 మీటర్ల బెస్ట్ త్రోతో రెండవ స్థానంలో నిలిచాడు. ఇదిలా ఉంటే 2017, 2018 డైమండ్‌ లీగ్‌ ఫైనల్స్‌ మీట్‌కు నీరజ్‌ అర్హత సాధించినా పతకం గెలవలేకపోయాడు. గత ఏడాది టోక్యో ఒలింపిక్స్‌లో స్వర్ణంతో సంచలనం సృష్టించిన నీరజ్‌ ఈ ఏడాది ప్రపంచ చాంపియన్‌షిప్‌లో రజతంతో మెరిశాడు. అయితే గాయంతో కామన్ వెల్త్ గేమ్స్ కు దూరమవడం అభిమానులను నిరాశ పరిచినా….ఇప్పుడు డైమండ్ లీగ్ ట్రోఫీ గెలవడం సంతోషాన్నిచ్చింది.