Site icon HashtagU Telugu

Neeraj Chopra: వరల్డ్‌ అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్స్‌ ఫైనల్లో నీరజ్‌ చోప్రా.. ఒలింపిక్స్‌కు కూడా అర్హత..!

Neeraj Chopra

Compressjpeg.online 1280x720 Image 11zon

Neeraj Chopra: ప్రపంచ అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్స్‌లో భారత స్టార్‌ జావెలిన్‌ త్రోయర్‌ నీరజ్‌ చోప్రా (Neeraj Chopra) అంచనాలకు తగ్గట్టుగా రాణిస్తున్నాడు. ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్ 2023లో భారత ఆటగాళ్లు అద్భుత ప్రదర్శన చేశారు. హంగేరిలోని బుడాపెస్ట్‌లో జరుగుతున్న ఈ టోర్నీలో జావెలిన్ త్రో ఈవెంట్‌లో నీరజ్ చోప్రా అద్భుత ప్రదర్శన చేశాడు. నీరజ్ ఫైనల్‌కు చేరుకున్నాడు. అతనితో పాటు భారత అథ్లెట్లు డిపి మను, కిషోర్ జెనా కూడా ఫైనల్స్‌కు చేరుకున్నారు. పాకిస్థాన్‌కు చెందిన అర్షద్ నదీమ్ కూడా ఫైనల్ చేరాడు.

పాక్ అథ్లెట్ అర్షద్ నదీమ్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ ప్రత్యేక పోస్ట్‌ను పంచుకున్నారు. ఇందులో నీరజ్ చోప్రాతో కలిసి కనిపిస్తున్నాడు. ఫైనల్‌కు ముందు ఓ ఛానెల్‌తో మాట్లాడిన నదీమ్.. నీరజ్ భాయ్ మీరు బాగా రాణిస్తారు. మేము కూడా బాగా రాణించాలి అనుకుంటున్నా. మీ పేరు ప్రపంచానికి తెలుసు. మా పేరు కూడా ప్రపంచానికి తెలియాలి అనుకుంటున్నాను అని పేర్కొన్నాడు. జావెలిన్‌ త్రో ఫైనల్స్‌ పోటీలు ఆదివారం జరగనున్నాయి.

Also Read: India squad: ఆసియా క్రీడల కోసం భారత్ నుంచి 634 మంది ఆటగాళ్లు

ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో నీరజ్ ఈ సీజన్‌లో అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చాడు. అతను 88.77 మీటర్ల దూరం జావెలిన్ విసిరాడు. ఫైనల్స్‌కు చేరుకోవడంతో పాటు, నీరజ్ పారిస్ ఒలింపిక్స్‌కు కూడా చోటు దక్కించుకున్నాడు. నీరజ్ మునుపటి సీజన్‌లో అత్యుత్తమంగా 88.67 మీటర్లు. డిపి మను 81.31 మీటర్ల దూరం జావెలిన్ విసిరాడు. కాగా కిషోర్ జెనా 80.55 మీటర్లు మాత్రమే విసిరాడు. పురుషుల జావెలిన్ త్రో ఈవెంట్‌లో 37 మంది క్రీడాకారులు పాల్గొనడం గమనార్హం. ఇందులో 12 మంది ఆటగాళ్లు మాత్రమే ఫైనల్‌కు చేరుకోగలిగారు. నీరజ్, అర్షద్‌లతో పాటు చెక్ రిపబ్లిక్‌కు చెందిన జాకోబ్ వాడ్లెచ్ కూడా అర్హత సాధించాడు. నదీమ్ 86.79 మీటర్ల వరకు విసిరాడు.

శుక్రవారం జరిగిన పోటీల్లో తను తొలి ప్రయత్నంలోనే జావెలిన్‌ను 88.77 మీటర్ల దూరం విసిరి ఫైనల్స్‌కు అర్హత సాధించాడు నీరజ్ చోప్రా. చోప్రాతో పాటు భారత్‌కే చెందిన డీపీ మను (81.31 మీ.), కిశోర్‌ జెనా (80.55 మీ) కూడా జావెలిన్‌ త్రో ఫైనల్స్‌లో చోటు దక్కించుకోవడం విశేషం. ఈ మెగా ఈవెంట్‌ ఫైనల్లో ఒకేసారి ముగ్గురు భారత అథ్లెట్లు చోటు సంపాదించడం ఇదే తొలిసారి. అటు ఈ సీజన్‌లో నీరజ్‌కు ఇదే ఉత్తమ ప్రదర్శన కావడం గమనార్హం.

 

Exit mobile version