LSG vs RCB : రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB), లక్నో సూపర్ జెయింట్స్ (LSG) మ్యాచ్ ఫలితం కంటే అక్కడ జరిగిన గొడవే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా కోహ్లీ , గంభీర్ మధ్య మ్యాచ్ ముగిసిన తర్వాత తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. దీనిపై బీసీసీఐ కూడా సీరియస్ అవడం, ఇద్దరికీ మ్యాచ్ ఫీజుకో జరిమానా విధించింది. అయితే అసలు ఈ గొడవకు కారణం ఏంటనేది మాత్రం తెలియాల్సి ఉంది. సిరాజ్ వేసిన ఓవర్లో లక్నో బ్యాటర్ నవీనుల్ హక్ కీ, కోహ్లీకి మధ్య మాటల యుద్ధం జరిగింది. ఇదే వాగ్వాదం మ్యాచ్ ముగిసే వరకూ కొనసాగింది. దీనిపైనే గంభీర్ చివర్లో రియాక్ట్ అవడం…కోహ్లీ కూడా తీవ్ర స్థాయిలో స్పందించడం గొడవ తీవ్రతను పెంచేశాయి. అయితే రెండు జట్ల మధ్య జరిగిన మరికొన్ని ఘటనలు, దానికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
మ్యాచ్ తర్వాత అసలు గొడవకు కారణమేంటో రాహుల్ కు విరాట్ వివరించే ప్రయత్నం చేశాడు. ఆ సమయంలో పక్కనే ఉన్న నవీన్ ను వచ్చి కోహ్లితో మాట్లాడాల్సిందిగా రాహుల్ కోరినా అతడు పట్టించుకోలేదు. నేను అతనితో మాట్లాడను అన్నట్లుగా చెబుతూ నవీన్ దూరంగా వెళ్లిపోయాడు. 17వ ఓవర్లో నవీనుల్ హక్ తో కోహ్లికి ఏదో గొడవ జరిగింది. ఆ సయమంలో క్రీజులో ఉన్న లక్నో ప్లేయర్ అమిత్ మిశ్రాతోపాటు అంపైర్లు కూడా జోక్యం చేసుకొని సర్ది చెప్పారు. అంపైర్లతో ఇదే విషయాన్ని విరాట్ చాలా సీరియస్ గా చర్చించాడు. చివర్లో కోహ్లీ తన షూ డస్ట్‌ని నవీన్‌కి చూపించాడు. 18వ ఓవర్ లోనూ కోహ్లి, నవీన్ మధ్య పోరు కొనసాగింది. ఈ వీడియోలన్నీ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
మ్యాచ్ ముగిసిన తర్వాత కూడా ఈ ఇద్దరు ప్లేయర్స్ మాటామాటా అనుకోగా.. లక్నో మెంటార్ గంభీర్ కూడా ఇందులో జోక్యం చేసుకున్నాడు. కరచాలనం సందర్భంగా కోహ్లీ-నవీన్ మధ్య మాటల వాగ్వాదం జరిగింది. తర్వాత రాహుల్ పిలిచినా లక్నో సూపర్ జెయింట్స్ పేసర్ నవీనుల్ హక్ పట్టించుకోకుండా వెళ్లిపోయాడు. కాగా నవీనుల్ హక్ తన మొహంపైనే మాట్లాడను అన్నట్లుగా సైగ చేయడం విరాట్ ఇగోను మరింత దెబ్బ తీసింది.