Site icon HashtagU Telugu

National Games 2022 : అట్టహాసంగా ప్రారంభమైన జాతీయ క్రీడలు

Natioonalgames Imresizer

Natioonalgames Imresizer

దేశంలో అత్యున్నత క్రీడా సంబరం మొదలయింది. 36వ జాతీయ క్రీడలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ప్రధాని మోడీ నరేంద్ర మోడీ అహ్మాదాబాద్‌లో ఈ క్రీడలను అధికారికంగా ప్రారంభించారు. రెండ్రోజుల పర్యటన నిమిత్తం గుజరాత్ చేరుకున్న ఆయన.. ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా ఓపెనింగ్ సెర్మనీ వేడుకలు అందరినీ ఆకట్టుకున్నాయి. ప్రముఖ సింగర్స్ శంకర్ మహదేవన్ , మోహిత్ చౌహాన్, భూమిక్ షా తమ పాటలతో అలరించారు. క్రీడాకారుల మార్చ్ ఫాస్ట్ , ఇతర సాంస్కృతిక కార్యక్రమాలు కలర్ ఫుల్ గా సాగాయి.

ఒలింపిక్ మెడలిస్ట్స్ నీరజ్ చోప్రా, పీ వీ సింధు ఆరంభ వేడుకల్లో సందడి చేశారు.
జాతీయ క్రీడలు లో ఈ సారి 36 క్రీడాంశాల్లో 7 వేలకు మంది పైగా అథ్లెట్లు పోటీపడబోతున్నారు. అక్టోబర్ 12 వరకు ఈ నేషనల్ గేమ్స్ జరుగనున్నాయి.అహ్మదబాద్, గాంధీనగర్, సూరత్, వడోదర, రాజ్ ఖోట్, భావ్ నగర్ లలో పోటీలు నిర్వహిస్తుండగా… సైక్లింగ్ గేమ్ మాత్రం ఢిల్లీలో జరగనుంది. జాతీయ క్రీడలకు గుజరాత్ ఆతిథ్యం ఇవ్వడం ఇదే తొలిసారి.

దాదాపు ఏడేళ్ల విరామం తర్వాత జాతీయ క్రీడలు జరుగుతున్నాయి. చివరగా 2015లో కేరళలో నేషనల్ గేమ్స్ జరిగాయి. ఈ సారి కొత్తగా ఖోఖో, యోగాసన్ తో పాటు మల్లఖంబ్ గేమ్స్ ను ప్రవేశపెట్టారు. ఇప్పటికే కబడ్డీ, లాన్ బౌల్స్, రగ్బీ పోటీలు మొదలుపోయాయి ఈ జాతీయ పోటీలకు పీవీ సింధు, నీరజ్ చోప్రా, నిఖత్ జరీన్ తో పాటు పలువురు స్టార్ ప్లేయర్స్ దూరమయినప్పటికీ ఒలింపిక్ విన్నర్స్ మీరాబాయిఛాను, లవ్లీనా ప్రత్యేక ఆకర్షణగా నిలవబోతున్నారు.