Natasa Instagram Post: హార్దిక్‌-న‌టాషా మ‌ధ్య ఏం జ‌రుగుతోంది..? వైర‌ల్ అవుతున్న తాజా పోస్ట్‌..!

  • Written By:
  • Updated On - May 30, 2024 / 11:02 AM IST

Natasa Instagram Post: హార్దిక్ పాండ్యా, నటాషా స్టాంకోవిచ్‌ (Natasa Instagram Post)ల విడాకుల గురించి వార్తలు తగ్గుముఖం పట్టడం లేదు. అసలు నిజం బయటకు వస్తుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ రూమర్స్ పై ఈ జంట ఇంకా ఎలాంటి రియాక్షన్ ఇవ్వలేదు. దీనిపై నటాషాను ప్రశ్నించగా..? ఆమె కూడా సమాధానం చెప్పకపోవడంతో ఈ అంశం మరింత ఉత్కంఠ‌గా మారింది. ఇదిలా ఉంటే తాజాగా నటాషా చేసిన పోస్ట్ ఇంటర్నెట్‌లో చర్చనీయాంశంగా మారింది. నటాషా ఈ పోస్ట్‌ను షేర్ చేసిన వెంటనే అది సోషల్ మీడియాలో దావానంలా వ్యాపించింది. అందరూ దీని గురించే మాట్లాడుకుంటున్నట్లు కనిపిస్తోంది. ఈ పోస్ట్‌లో ఏముందో తెలుసుకుందాం..!

న‌టాషా ఈ పోస్ట్‌‌ను భాగస్వామ్యం చేశారు

బుధ‌వారం నటాషా తన ఇన్‌స్టాగ్రామ్‌లో విడాకుల వార్తల మధ్య మొదటి పోస్ట్‌ను పంచుకుంది. ఈ పోస్ట్‌ను షేర్ చేస్తున్నప్పుడు నటాషా పక్షి గుర్తు, తెల్లటి గుండె ఎమోజి, జీసస్ శిలువ, నక్షత్రాల గుర్తును పంచుకున్నట్లు క్యాప్షన్‌లో రాసింది. తాజా పోస్ట్‌లో నటాషా తన ఫోటోను పంచుకుంది. అందులో ఆమె కూల్ లుక్‌లో కనిపిస్తుంది. పోస్ట్‌లో నటాషా వైట్ కలర్ లాంగ్ టాప్, డెనిమ్ జీన్స్ ధరించి ఉంది. దీనితో పాటు రెండవ ఫోటోలో నటి ఒక బిడ్డతో జీసస్ ఫోటోను కూడా పంచుకుంది. సోషల్ మీడియాలో ఈ పోస్ట్ కనిపించిన వెంటనే అది దావానలంలా వైరల్ అయింది. దీనిపై అందరూ స్పందిస్తున్నారు.

Also Read: Weather Update: ప్ర‌జ‌ల‌కు రిలీఫ్ న్యూస్ చెప్పిన వాతావ‌ర‌ణ శాఖ‌..!

యూజ‌ర్ల రియాక్షన్ ఇదే

హార్దిక్‌తో విడిపోయి తప్పు చేస్తున్నారు అని ఒక వినియోగదారు దీనిపై వ్యాఖ్యానించారు. హార్దిక్‌పై ప్రేమ అని మరొకరు రాశారు. ఆ దేవుడే నిన్ను బలవంతురాలిగా చెయ్యాలి అని ఓ యూజ‌ర్ వ్యాఖ్యానించాడు. ఈ పోస్ట్‌పై ఇప్పుడు వినియోగదారులు త‌మ‌దైన శైలిలో వ్యాఖ్యలు చేస్తున్నారు. నటాషా తన ఇన్‌స్టాగ్రామ్ నుండి హార్దిక్ ఇంటిపేరును తొలగించినప్పటి నుండి వారి విడిపోవడం గురించి చర్చ జోరందుకుంది. అందరూ రకరకాలు కార‌ణాలు కూడా చెబుతున్నారు.

We’re now on WhatsApp : Click to Join

ఈ జంట స్పందన కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారు

అయితే ఇప్పుడు ఈ జంట స్పందన కోసం ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దీనిపై త్వరలోనే ఈ జంట మౌనం వీడుతుందని, నిజానిజాలు ప్రపంచానికి వెల్లడిస్తారని, అప్పటి వరకు ప్రజలు వేచి చూడక తప్పదని భావిస్తున్నారు. అయితే ఈ జంట మధ్య అంతా సవ్యంగా సాగాలని, ఈ జంట కలిసి ఉండాలని అభిమానులు ప్రార్థిస్తున్నారు.