Site icon HashtagU Telugu

RCB vs KKR Highlights: హోం గ్రౌండ్ లో బెంగుళూరుకు షాక్… కోల్ కత్తా నైట్ రైడర్స్ కు రెండో విజయం

KKR won

KKR won

RCB vs KKR Highlights: ఐపీఎల్ 17వ సీజన్ లో హోం టీమ్స్ విజయాల సెంటిమెంట్ బ్రేక్ అయింది. వరుసగా 9 మ్యాచ్ ల్లోనూ ఆతిథ్య జట్లే గెలవగా…10వ మ్యాచ్ లో మాత్రం సీన్ రివర్స్ అయ్యింది. బెంగుళూరు వేదికగా జరిగిన మ్యాచ్ లో కోల్ కత్తా నైట్ రైడర్స్ 7 వికెట్ల తేడాతో ఆర్సీబీ పై విజయం సాధించింది.

టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఆర్‌సీబీకి ఆదిలోనే గట్టి షాక్ తగిలింది. హర్షిత్ రాణా వేసిన రెండో ఓవర్‌లో డుప్లెసిస్ వెనుదిరిగాడు. క్రీజులోకి వచ్చిన కామెరూన్ గ్రీన్‌తో కలిసి కోహ్లీ ధాటిగా ఆడాడు.విరాట్ కోహ్లీ 59 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్‌లతో 83 రన్స్ చేశాడు. విరాట్ కోహ్లీకి తోడుగా కామెరూన్ గ్రీన్ 21 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో 33 , మ్యాక్స్‌వెల్(19 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్‌తో 28 రన్స్ తో రాణించారు. చివర్లో దినేశ్ కార్తీక్ 8 బంతుల్లో 3 సిక్స్‌లతో 20 మెరుపులు మెరిపించాడు. కేకేఆర్ బౌలర్లలో హర్షిత్ రాణా, ఆండ్రీ రస్సెల్ రెండేసి వికెట్లు తీయగా.. సునీల్ నరైన్ ఓ వికెట్ పడగొట్టాడు.

We’re now on WhatsAppClick to Join.

లక్ష్య చేధనలో కోల్ కత్తాకు ఓపెనర్లు మెరుపు ఆరంభాన్ని ఇచ్చారు. ఫిల్ సాల్ట్ , సునీల్ నరైన్ రెచ్చిపోయారు. నరైన్ అయితే బెంగుళూరు బౌలర్లకు చుక్కలు చూపించాడు. భారీ సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. ఫలితంగా కోల్ కత్తా పవర్ ప్లే లోనే 85 పరుగులు చేసింది. నరైన్ 22 బంతుల్లో 5 సిక్సర్లు , 2 ఫోర్లతో 47 రన్స్ చేశాడు. సాల్ట్ 30 రన్స్ చేయగా…తర్వాత వెంకటేష్ అయ్యర్ , శ్రేయాస్ అయ్యర్ అదే దూకుడు కొనసాగించారు. వీరిద్దరూ మూడో వికెట్ కు 75 పరుగులు జోడించారు. బెంగుళూరు బౌలర్లు ఏ మాత్రం ప్రభావం చూపలేక పోయారు. దీంతో కోల్ కత్తా 16.5 ఓవర్లలోనే టార్గెట్ అందుకుంది. వెంకటేష్ అయ్యర్ 30 బంతుల్లో 50 , శ్రేయాస్ అయ్యర్ 25 బంతుల్లో 39 రన్స్ చేశారు. బెంగళూరుకు ఇది రెండో ఓటమి కాగా కోల్ కత్తా నైట్ రైడర్స్ కు రెండో విజయం.

Also Read: Actor Nikhil Join in TDP: టీడీపీలో చేరిన టాలీవుడ్ హీరో నిఖిల్