Site icon HashtagU Telugu

RSWS 2022: ఓజా, పఠాన్ విధ్వంసం… ఫైనల్లో ఇండియా లెజెండ్స్

Rsws Imresizer

Rsws Imresizer

రిటైర్ అయినా తమలో ఆట టీ మాత్రం తగ్గలేదని రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్ లో మాజీ ఆటగాళ్ళు నిరూపిస్తున్నారు. వయసు మీద పడినా తమదైన ఆటతో అదరగొడుతున్నారు. అందుకే ఈ టోర్నీ మ్యాచ్ లు నువ్వా నేనా అన్నట్టు సాగుతున్నాయి. తాజాగా ఇండియా లెజెండ్స్ , ఆస్ట్రేలియా లెజెండ్స్ మధ్య సెమీఫైనల్ థ్రిల్లింగ్ గా సాగింది.
ఆస్ట్రేలియా లెజెండ్స్‌తో జరిగిన ఉత్కంఠకర మ్యాచ్‌లో సచిన్ టెండూల్కర్ సారథ్యంలోని ఇండియా లెజెండ్స్ 5 వికెట్ల తేడాతో గెలుపొంది ఫైనల్లో అడుగుపెట్టింది . ఆఖరి ఓవర్ వరకు ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌లో నమాన్ ఓజా, ఇర్ఫాన్ పఠాన్ విధ్వంసకర ఇన్నింగ్స్‌తో ఇండియా లెజెండ్స్ ను గెలిపించారు. వర్షం కారణంగా రెండు రోజుల పాటు ఈ మ్యాచ్ జరిగింది. మొదట
బ్యాటింగ్ కు దిగిన ఆస్ట్రేలియా లెజెండ్స్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 171 పరుగులు చేసింది. బెన్ డంక్ 26 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లతో 46 టాప్ కెప్టెన్ వాట్సన్ 21 బంతుల్లో 6 ఫోర్లతో 30, అలెక్స్ డూలన్ 31 బంతుల్లో 5 ఫోర్లోతో 35, కామెరూన్ వైట్ 18 బంతుల్లో ఫోర్, 2 సిక్స్‌లతో 30 నాటౌట్ రాణించారు. భారత లెజెండ్స్ బౌలర్లలో మునాఫ్ పటేల్ , యూసఫ్ పఠాన్ రెండేసి వికెట్లు తీయగా.. రాహుల్ శర్మ ఓ వికెట్ పడగొట్టాడు.

భారీ లక్ష్య చేదనలో ఇండియా లెజెండ్స్ తడబడింది. సచిన్ , రైనా , యువరాజ్ సింగ్ , యూసుఫ్ పఠాన్ తక్కువ స్కోర్ కే ఔటయ్యారు.
దీంతో ఇండియా లెజెండ్స్ 125 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి ఓటమి ఖాయమనిపించింది.
ఈ దశలో నమన్ ఓజా, ఇర్ఫాన్ పఠాన్ విధ్వంసకర బ్యాటింగ్‌తో జట్టును గెలిపించారు. ఎటాకింగ్ బ్యాటింగ్ తో అదరగొట్టిన వీరిద్దరూ భారీ షాట్లతో అలరించారు. నమన్ ఓజా కేవలం 62 బంతుల్లో 90 రన్స్ చేశాడు. చివరి 4 ఓవర్లలో విజయానికి 49 పరుగులు అవసరమవ్వగా.. ఇర్ఫాన్ పఠాన్ విధ్వంసం సృష్టించాడు. పఠాన్
ఒక్కడే 36 పరుగులు చేశాడు. నాన్స్ వేసిన 19వ ఓవర్‌లో మూడు సిక్సర్లు బాది ఇండియా లెజెండ్స్ విజయాన్ని పూర్తి చేశాడు. దీంతో ఇండియా లెజెండ్స్ మరో 4 బాల్స్ మిగిలి ఉండగానే విజయం సాధించింది.