Rafel Nadel : నాదల్‌ క్రీడాస్ఫూర్తికి ఫ్యాన్స్ ఫిదా

ఏ ఆటలోనైనా గెలుపు ఓటమలు సహజం.. అయితే నిజమైన క్రీడాస్ఫూర్తితో వ్యవహరించడం కూడా ముఖ్యమే.. పలు సందర్భాల్లో క్రీడాస్ఫూర్తి ప్రదర్శించిన ఘటనలు చూస్తూనే ఉంటాం. తాజాగా ప్రపంచ టెన్నిస్‌లో క్లే కోర్ట్ కింగ్‌గా పేరున్న రఫెల్ నాదల్‌ తన స్పోర్టింగ్ స్పిరిట్ మరోసారి చాటాకున్నాడు. చాలా సందర్భాల్లో ఆటతో పాటు తన క్రీడాస్ఫూర్తితో అభిమానుల మనసులు గెలుచుకున్న నాదల్ మరోసారి తన గొప్ప మనసు చాటుకున్నాడు. నాదల్ క్రీడాస్ఫూర్తికి ఈ సారి ఫ్రెంచ్ ఓపెన్ వేదికగా నిలిచింది. […]

Published By: HashtagU Telugu Desk
Rafel Nadel

Rafel Nadel

ఏ ఆటలోనైనా గెలుపు ఓటమలు సహజం.. అయితే నిజమైన క్రీడాస్ఫూర్తితో వ్యవహరించడం కూడా ముఖ్యమే.. పలు సందర్భాల్లో క్రీడాస్ఫూర్తి ప్రదర్శించిన ఘటనలు చూస్తూనే ఉంటాం. తాజాగా ప్రపంచ టెన్నిస్‌లో క్లే కోర్ట్ కింగ్‌గా పేరున్న రఫెల్ నాదల్‌ తన స్పోర్టింగ్ స్పిరిట్ మరోసారి చాటాకున్నాడు. చాలా సందర్భాల్లో ఆటతో పాటు తన క్రీడాస్ఫూర్తితో అభిమానుల మనసులు గెలుచుకున్న నాదల్ మరోసారి తన గొప్ప మనసు చాటుకున్నాడు. నాదల్ క్రీడాస్ఫూర్తికి ఈ సారి ఫ్రెంచ్ ఓపెన్ వేదికగా నిలిచింది. స్పెయిన్ బుల్ నాదల్‌తో హోరాహోరీగా సెమీఫైనల్ జరుగుతుండగా..జర్మనీ ప్లేయర్ అలెగ్జాండర్ జ్వెరెవ్ అనూహ్యాంగా గాయపడ్డాడు. షాట్ కొట్టే క్రమంలో పాదానికి గాయమవడంతో తీవ్రమైన నొప్పితో విలవిలలాడాడు. నొప్పిని భరించలేక ఒకదశలో కన్నీళ్ళు కూడా పెట్టుకున్నాడు.

కనీసం నడవలేని స్థితిలో ఉండడంతో చేతికర్రల సాయంతో కోర్టు బయటకు తీసుకెళ్ళారు. అయితే ఈ సమయంలో నాదల్ క్రీడాస్ఫూర్తి అభిమానులను ఆకట్టుకుంది. జ్వెరెవ్‌ దగ్గరకు వెళ్ళిన నాదల్ అతన్ని ఓదార్చాడు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్‌గా మారింది. నాదల్ గొప్ప మనసుకు ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. గాయంతో జ్వెరెవ్ తప్పుకోవడంతో నాదల్ ఫ్రెండ్ ఓపెన్ ఫైనల్‌కు చేరుకోగా.. అనంతరం మీడియాలో మాట్లాడుతూ జ్వెరెవ్ ఆటతీరుపై ప్రశంసలు కురిపంచాడు. నిజాయితీగా చెబుతున్నా…జ్వెరెవ్ ఈ టోర్నీలో అద్భుతంగా ఆడుతున్నాడని కితాబిచ్చాడు. అతను త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించిన నాదల్ జ్వెరెవ్ గ్రాండ్‌శ్లామ్ టైటిల్స్ ఒకటి కాదు ఎన్నో గెలుస్తాడని జోస్యం చెప్పాడు.

  Last Updated: 05 Jun 2022, 08:45 AM IST