Site icon HashtagU Telugu

Roger Federer : ఫేర్ వెల్ మ్యాచ్ లో ఫెదరర్ ఎమోషనల్

Federer Emotional

Federer Emotional

ప్రపంచ టెన్నిస్ లో ఓ శకం ముగిసిందితన ఆటతో అంతకుముంచి తన మంచి మనసుతో ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న స్విస్ టెన్నిస్ దిగ్గజం రోజర్ ఫెదరర్ ఆ గుడ్ బై చెప్పాడు. 24 ఏళ్ల పాటు టెన్నిస్ కోర్టును ఏలిన ఫెదరర్, కన్నీటితో తన కెరీర్‌కి ముగింపు పలికాడు. లండన్‌లో జరిగిన డబుల్స్ మ్యాచ్‌లో నాదల్-ఫెదరర్ జోడీపై జాక్ సాక్- ఫ్రాన్సిస్ టియాఫో 4-6 7-6 11-9 తేడాతో విజయం సాధించింది.లేవర్ కప్‌ లో యూరప్ తరపున బరిలోకి దిగిన ఈ స్విస్ స్టార్ ఫేర్‌వెల్ మ్యాచ్ ముగిసిన తర్వాత కన్నీటి పర్యంతమయ్యాడు. ఫెదరర్‌తో పాటు స్పెయిన్ ప్లేయర్ రఫెల్ నాదల్ కూడా ఎమోషనల్ అయ్యాడు. ఈ ఇద్దరు టెన్నిస్ లెజెండ్స్‌ చిన్నపిల్లల్లా కన్నీళ్లు పెట్టుకోవడం చూసి స్టేడియం అంతా చిన్నబోయింది. ఈ మ్యాచ్‌కి రోజర్ ఫెదరర్ కుటుంబం కూడా హాజరైంది.పేరెంట్స్ లేకపోతే తాను ఇక్కడ ఉండేవాడిని కాదని వీడ్కోలు స్పీచ్ లో ఫెదరర్ వ్యాఖ్యానించాడు. రాకెట్ పట్టకుండా ఉండే రోజులను ఎలా ఎదుర్కోవాలో తెలియట్లేదని కన్నీళ్లు పెట్టుకున్నాడు. అతను మాట్లాడుతున్న సమయంలో ఫెదరర్ భార్య, తల్లిదండ్రులు స్టాండ్స్‌లోనే ఉన్నారు. ఫెదరర్ మాట్లాడుతున్నంత సేపూ అతని చిరకాల ప్రత్యర్థి రాఫెల్ నాదల్ కన్నీరు పెట్టుకుంటూనే కనిపించడు. నోవాక్ జొకోవిచ్ కూడా ఫెదరర్‌ను చూస్తూ కన్నీటి పర్యంతం అయ్యాడు.

 

41 సంవత్సరాల రోజర్.. ఈ మధ్య టెన్నిస్‌కు వీడ్కోలు పలకబోతోన్నట్లు ప్రకటించాడు. 1998లో ప్రొఫెషనల్ టెన్నిస్ ఆటగాడిగా మారిన ఫెదరర్ 24 ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌లో 82 శాతం విన్నింగ్ రికార్డ్ సాధించాడు.పురుషుల సింగిల్స్‌లో 20 గ్రాండ్‌స్లామ్‌ టైటిళ్లు సాధించిన తొలి ప్లేయర్‌గా చరిత్రకెక్కాడు.2003 వింబుల్డన్‌లో విజేతగా నిలిచి తొలి గ్రాండ్‌స్లామ్ టైటిల్‌ అందుకున్న ఫెడెక్స్ కెరీర్ మొత్తం 6 ఆస్ట్రేలియా ఓపెన్, 8 వింబుల్డన్, 5 యూఎస్ ఓపెన్ టైటిళ్లతో పాటు ఒక ఫ్రెంచ్ ఓపెన్ గెలిచాడు. 41 ఏళ్ల ఫెదరర్ గతేడాది వింబుల్డన్ క్వార్టర్ ఫైనల్లో మోకాలి గాయంతో ఆటకు దూరమయ్యాడు. టోక్యో ఒలింపిక్స్‌తో పాటు ఈ ఏడాది జరిగిన ఏ టోర్నీలోనూ ఆడలేదు.