Site icon HashtagU Telugu

world record feat: తమిళనాడు క్రికెటర్‌ ప్రపంచ రికార్డు..!

Cropped (2)

Cropped (2)

తమిళనాడు క్రికెటర్‌ జగదీశన్ ప్రపంచ రికార్డు సృష్టించాడు. లిస్ట్‌ – A మ్యాచ్‌లో అత్యధిక వ్యక్తిగత స్కోర్‌ (277) నమోదు చేశాడు. విజయ్ హజారే ట్రోఫీలో అరుణాచల్‌ప్రదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో జగదీశన్‌ ఈ రికార్డు సాధించాడు. 141 బంతుల్లో 277 పరుగులు చేశాడు. 2014లో రోహిత్‌ శర్మ (264) ఈ రికార్డును చేజార్చుకున్నాడు. అరుణాచల్‌ ప్రదేశ్‌ (తమిళనాడు వర్సెస్ అరుణాచల్‌ ప్రదేశ్‌)తో సోమవారం జరిగిన మ్యాచ్‌లో తమిళనాడు ఓపెనర్ నారాయణ్ జగదీశన్ చరిత్ర సృష్టించాడు. 141 బంతుల్లో 277 పరుగులు చేసి జగదీశన్ ఎన్నో రికార్డులు సృష్టించాడు. విజయ్ హజారే ట్రోఫీలో తమిళనాడు స్టార్ ఓపెనర్ జగదీశన్ అద్భుత ప్రదర్శన చేస్తున్నాడు. అరుణాచల్‌పై సెంచరీ చేసిన వెంటనే ప్రపంచ రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. లిస్ట్-ఎ కెరీర్‌లో వరుసగా ఐదు సెంచరీలు సాధించిన ప్రపంచంలోనే తొలి ఆటగాడిగా నిలిచాడు.

గత నాలుగు ఇన్నింగ్స్‌ల్లో సెంచరీలు బాదిన జగదీశన్.. అరుణాచల్‌ ప్రదేశ్‌పై తన ఇన్నింగ్స్‌తో యావత్ క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచాడు. 277 పరుగుల చక్కటి ఇన్నింగ్స్ ఆడాడు. దీంతో లిస్ట్-ఎ క్రికెట్‌లో 2014లో రోహిత్‌ శర్మ (264) ఈ రికార్డును చేజార్చుకున్నాడు. అరుణాచల్‌ ప్రదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో జగదీశన్ మొదట 76 బంతుల్లో సెంచరీ పూర్తి చేసి.. సెంచరీ తర్వాత గేర్‌ మార్చి బ్యాటింగ్ చేసి కేవలం 38 బంతుల్లో మరో 100 పరుగులు చేశాడు. దేశవాళీ 50 ఓవర్ల టోర్నమెంట్ విజయ్ హజారే ట్రోఫీలో జగదీశన్ అద్భుతమైన ఫామ్‌ కనబరుస్తున్నాడు. ఇప్పటివరకు ఆడిన 6 ఇన్నింగ్స్‌ల్లో 159 సగటుతో 799 పరుగులు చేశాడు. జగదీశన్ కంటే ముందు శ్రీలంక ఆటగాడు సంగక్కర వరుసగా నాలుగు ఇన్నింగ్స్‌లలో సెంచరీ చేసిన రికార్డును కలిగి ఉన్నాడు. కానీ తమిళనాడు ఆటగాడు జగదీశన్ వరుసగా ఐదు సెంచరీలు సాధించి ఈ ఘనత సాధించాడు.