Site icon HashtagU Telugu

Shikhar Dhawan:నా టార్గెట్ వన్డే ప్రపంచకప్ : ధావన్

Dhawan Imresizer

Dhawan Imresizer

ఇంగ్లాండ్‌ సిరీస్‌తో చాలా రోజుల తర్వాత జాతీయ జట్టులోకి రీ ఎంట్రీ ఇచ్చిన గబ్బర్. రెగ్యులర్‌ ఓపెనర్‌ కేఎల్‌ రాహుల్‌ గాయం కారణంగా దూరం కావడంతో రోహిత్‌ శర్మతో కలిసి ఇన్నింగ్స్ ఓపెనింగ్‌ చేస్తున్నాడు. ఇటీవల ఐపీఎల్‌లో కూడా నిలకడగా రాణించిన ధావన్ వచ్చే వన్డే వరల్డ్‌కప్‌ గెలవడమే లక్ష్యంగా బరిలోకి దిగుతున్నాడు. ది టెలిగ్రాఫ్‌కు ఇంటర్వ్యూ ఇచ్చిన గబ్బర్‌ తన భవిష్యత్‌ ప్రణాళికల గురించి చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం తన దృష్టంతా వచ్చే ఏడాది వన్డే వరల్డ్‌కప్‌ పైనే ఉందని ధావన్ చెప్పారు. ఈ గ్యాప్‌లో వీలైనన్ని ఎక్కువ మ్యాచ్‌లు ఆడాలని అనుకుంటున్నట్టు తెలిపాడు. అప్పుడే ప్రపంచకప్‌ జట్టులో చోటుతో పాటు తనను తాను నిరూపించుకునే అవకాశం లభిస్తుందన్నాడు
అంతకంటే ముందు ఐపీఎల్‌తో పాటు మరింత గొప్పగా రాణించాలనుకుంటున్నట్టు చెప్పాడు. వరల్డ్‌కప్‌ కంటే ముందు దేశవాళీ వన్డే క్రికెట్‌, టీ20 మ్యాచ్‌లలో ఆడతానని వెల్లడించాడు.. ఇంగ్లండ్‌ పర్యటనకు తాను పూర్తిస్థాయిలో సన్నద్ధమయ్యానని , ఫిట్‌నెస్ పరంగానూ మెరుగయ్యానని చెప్పుకొచ్చాడు. ఈ సిరీస్‌తో పూర్తి స్థాయిలో ఫామ్‌లోకి వస్తానని కాన్ఫిడెంట్‌గా చెప్పాడు. ఓపెనర్‌గా తనకు చాలా అనుభవం ఉన్నప్పటకీ… టెక్నిక్ పరంగా మరింత మెరుగయ్యేందుకు ప్రయత్నిస్తున్నట్టు చెప్పాడు. . చిన్న చిన్న స్కోర్లను సైతం భారీ స్కోర్లుగా మలచడంపై దృష్టి సారించాలనుకుంటున్నట్టు తెలిపాడు. 36 ఏళ్ళ శిఖర్ ధావన్ ఈ ఏడాది ఐుీఎల్‌లో పంజాబ్ కింగ్స్‌కు ప్రాతినిథ్యం వహించాడు. 14 ఇన్నింగ్స్‌లలో 460 పరుగుల చేయడం ద్వారా ఫామ్ అందుకున్నాడు. అయితే టీ ట్వంటీ వరల్డ్‌కప్‌ కోసం యువ ఆటగాళ్ళపైనే సెలక్టర్లు ఎక్కువగా ఫోకస్ పెట్టడంతో ధావన్‌ వన్డేలకే పరిమితమయ్యే అవకాశముంది. వచ్చే విండీస్ టూర్‌కు ధావన్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు.