టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా రాబోయే వన్డే సిరీస్ కోసం సిద్దమవుతున్నాడు. టి20 సిరీస్ లో అద్భుతంగా రాణించిన పాండ్యా వన్డే సిరీస్ లోనూ సత్తా చాటగలడని నిపుణులు భావిస్తున్నారు. అయితే ఈ సిరీస్ ప్రారంభానికి ముందు హార్దిక్ ఒక ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. రోహిత్ శర్మపై హార్దిక్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. మరోవైపు టి20 వరల్డ్ కప్ లో ఫైనల్ మ్యాచ్ పై హార్దిక్ కీలక వ్యాఖ్యలు చేశాడు.
టి20 ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్ పై హార్దిక్ మాట్లాడుతూ.. నా పొటన్షియాలిటీ రోహిత్ కు బాగా తెలుసనీ హార్దిక్ చెప్పాడు. క్లాసెన్‌ను అవుట్ చేయడానికి ముందు రోహిత్ తో చర్చించినట్లు చెప్పాడు. బంతి వేయడానికి ముందు క్లాసెన్‌కు వైడ్ బాల్ వేస్తానని రోహిత్ తో సంభాషించినట్లు హార్దిక్ అన్నాడు. ఇలా పక్కా ప్రణాళికతోనే క్లాసెన్ వికెట్ తీశానని చెప్పాడు. అయితే హార్దిక్ రోహిత్ శర్మపై చేసిన వ్యాఖ్యలు చర్చకు దారి తీశాయి. గతంలో రోహిత్, హార్దిక్ మధ్య విభేదాలున్నట్లు వార్తలు వినిపించాయి. గత సీజన్ ఐపీఎల్ కి ముంది రోహిత్ ను కెప్టెన్ నుంచి తప్పించి ముంబైకి హార్దిక్ ను కెప్టెన్ చేశారు. పైగా మైదానంలో హార్దిక్ రోహిత్ ని బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ కి పంపడం అప్పట్లో సంచలనంగా మారింది. కానీ టి20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ లో రోహిత్ హార్దిక్ ని కౌగిట్లోకి తీసుకుని ఏడుస్తున్న హార్దిక్ ని ఓదార్చడం అందర్నీ ఎమోషనల్ గా కనెక్ట్ చేసింది. ఇద్దరూ భావోద్వేగానికి గురై ఒకరినొకరు కౌగిలించుకున్నారు. దీంతో ఇద్దరి మధ్య విభేధాలున్నట్లు వస్తున్న వార్తలకి ఫుల్ స్టాప్ పడింది.
2024 ఐసిసి టి20 ప్రపంచ కప్ చివరి మ్యాచ్ భారత్ దక్షిణాఫ్రికా మధ్య జరిగింది. ఆ మ్యాచ్‌లో టీమిండియా 177 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ఛేదనలో దక్షిణాఫ్రికా ఆరంభంలో అద్భుతంగా రాణించింది. చివరి వరకు మ్యాచ్ ఉత్కంఠగా సాగింది. ఒక దశలో ఆతిథ్య జట్టు 151/5తో విజయానికి చేరువైంది. కానీ హెన్రిచ్ క్లాసెన్ దూకుడుకి హార్దిక్ బ్రేకులు వేసి మ్యాచ్ ని మన చేతుల్లోకి తీసుకొచ్చాడు. ఈ మ్యాచ్‌లో హార్దిక్ పాండ్యా 3 వికెట్లు తీసి దక్షిణాఫ్రికాను కట్టడి చేశాడు.