Site icon HashtagU Telugu

MS Dhoni : నేను పది పాస్ అవుతానని మా నాన్న అనుకోలేదు..!!

Ms Dhoni

Ms Dhoni

ms dhoni..ప్రపంచకప్ తోపాటు…భారత జట్టుకు ఎన్నో ట్రోఫీలు అందించిన ఘనత ఆయనది. ధోని సారథ్యంలో టీమిండియా ఎన్నో గొప్ప విజయాలను తన ఖాతాలో వేసుకుంది. క్రికెట్ లో ఎన్నో ఘనత సాధించినప్పటికీ…చదువులో మాత్రం సాధారణ విద్యార్థి మాత్రమే. ఈ విషయాన్ని స్వయంగా ధోనినే చెప్పారు. ఓ పాఠశాలలో విద్యార్థులకు కలిసి ముచ్చడించాడు ధోని. ఆనాటి విషయాలను నెమరేసుకున్నాడు. తాను పది పాస్ కానని తన తండ్రి అనుకున్నట్లు చెప్పాడు.

మీ ఎలాంటి స్టూడెంట్? మీకు ఇష్టమైన సబ్జెక్ట్ ఏంటి? అని ఓ విద్యార్థి ప్రశ్నించాడు. దీనికి మిస్టర్ కూల్…నిజంగానే కూల్ గా సమాధానం చెప్పాడు. నవ్వుతూ…నేను ఒక సాధారణ విద్యార్థిని. ఏడో తరగతి నుంచి క్రికెట్ ఆడటం ప్రారంభించాను. ప్రాక్టీస్ చేస్తూ తరగతులకు హాజరయ్యేవాడిని. అందుకే నాకు హాజరు శాతం తక్కువగా వచ్చేది. పదో తరగతిలో దాదాపు 66శాతం, 12లో 57శాతం మార్కులు మాత్రమే వచ్చాయని చెప్పాడు.

క్రికెట్ పై ఎక్కువగా ఆసక్తి ఉండటంతో…నాకు హాజరు శాతం తక్కువగా ఉండేదు. కొంచెంగా కష్టంగా అనిపించేది. పదవ తరగతిలో కొన్ని అధ్యాయాల గురించి నాకు తెలియదు. వాటిలో నుంచి ప్రశ్నలు వస్తే ఏం రాయలో కూడా అర్థం కాలేదు. నేను పది పాస్ అవుతానని మా నాన్న అనుకోలేదు. మళ్లీ పరీక్షలు రాయాలేమో అనుకున్నారు. కానీ నేను పది పాసయ్యాను. అప్పుడు ఆయన ఎంతో సంతోషించాడు అటూ ధోని చెప్పుకొచ్చాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది.

Exit mobile version