PR Sreejesh: నా దేశం నాకు ఎక్కువే ఇచ్చింది: పీఆర్‌ శ్రీజేష్‌

శ్రీజేష్ ఇంకా మాట్లాడుతూ.. ఆట నుండి రిటైర్ అయిన తర్వాత ఈ అవార్డును అందుకోవడం గత 20 ఏళ్లలో నేను భారత హాకీ కోసం చేసిన దానికి దేశం నన్ను గౌరవిస్తున్నట్లు భావిస్తున్నాను.

Published By: HashtagU Telugu Desk
PR Sreejesh

PR Sreejesh

PR Sreejesh: భారత పురుషుల జట్టు మాజీ గోల్‌కీపర్‌ పీఆర్‌ శ్రీజేష్‌కు (PR Sreejesh) ప్రతిష్టాత్మక పద్మభూషణ్‌ లభించింది. ఇది భారతదేశంలో మూడవ అత్యున్నత పౌర పురస్కారం. పిఆర్ శ్రీజేష్ ప్రస్తుతం జూనియర్ పురుషుల జట్టు కోచ్‌గా పనిచేస్తున్నారు. పీఆర్ శ్రీజేష్ కెరీర్ చాలా అద్భుతంగా సాగింది. 18 ఏళ్ల కెరీర్‌లో అతను 336 అంతర్జాతీయ మ్యాచ్‌లలో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించాడు. అతను పారిస్ ఒలింపిక్స్ 2024 తర్వాత రిటైర్ అయ్యాడు.

ఈ ఘనత సాధించిన రెండో హాకీ ప్లేయర్‌గా నిలిచాడు

మేజర్ ధ్యాన్ చంద్ తర్వాత పద్మభూషణ్ అందుకున్న రెండో హాకీ ప్లేయర్ పీఆర్ శ్రీజేష్. మేజర్ ధ్యాన్ చంద్ 1956లో ఈ అవార్డుతో సత్కరించారు. పిఆర్ శ్రీజేష్ తన గత ఒలింపిక్స్‌లో చాలా అద్భుతంగా రాణించాడు. అతని అసాధారణ గోల్ కీపింగ్ భారతదేశం కాంస్య పతకాన్ని గెలుచుకోవడంలో గణనీయంగా దోహదపడింది. అతని అవార్డుల జాబితాలో 2021, 2022, 2024లో FIH గోల్‌కీపర్ ఆఫ్ ది ఇయర్, 2015లో అర్జున అవార్డు, 2021లో మేజర్ ధ్యాన్‌చంద్ ఖేల్ రత్న అవార్డు, 2021లో వరల్డ్ గేమ్స్ అథ్లెట్ ఆఫ్ ద ఇయర్ టైటిల్‌లు ఉన్నాయి.

Also Read: Jannik Sinner: ఆస్ట్రేలియన్ ఓపెన్ సింగిల్స్ విజేతగా సిన్న‌ర్‌!

అవార్డులు ప్ర‌క‌టించిన స‌మ‌యంలో శ్రీజేష్ ఏం చేస్తున్నారంటే?

“ఉదయం క్రీడా మంత్రిత్వ శాఖ నుండి నాకు కాల్ వచ్చింది. అయితే సాయంత్రం వరకు అధికారిక ప్రకటన కోసం వేచి ఉన్నాను” అని శ్రీజేష్ PTI కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. ఈ సమయంలో నా మనసులో అంతా ఫ్లాష్‌బ్యాక్‌లా సాగుతోంది. అవార్డులు ప్రకటించినప్పుడు నేను రూర్కెలాలో హాకీ ఇండియా లీగ్ మ్యాచ్ చూస్తున్నానని శ్రీజేష్ తెలిపాడు.

శ్రీజేష్ ఇంకా మాట్లాడుతూ.. ఆట నుండి రిటైర్ అయిన తర్వాత ఈ అవార్డును అందుకోవడం గత 20 ఏళ్లలో నేను భారత హాకీ కోసం చేసిన దానికి దేశం నన్ను గౌరవిస్తున్నట్లు భావిస్తున్నాను. నేను ఇచ్చిన దానికంటే ఎక్కువ ఇచ్చిన నా దేశానికి ధన్యవాదాలు చెప్పాలనుకుంటున్నాను అని ఆయ‌న భావోద్వేగం చెందారు.

  Last Updated: 26 Jan 2025, 07:14 PM IST