నా దేశానికే మొదటి ప్రాధాన్యత : బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ నుండి వైదొలిగిన తర్వాత భారత వ్యాఖ్యాత రిధిమా పాఠక్ షాకింగ్ కామెంట్స్

Ridhima Pathak బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ (బీపీఎల్) నుంచి భారత స్పోర్ట్స్ ప్రెజెంటర్ రిధిమా పాఠక్ స్వచ్ఛందంగా తప్పుకున్నట్లు స్పష్టం చేశారు. భారత్ – బంగ్లాదేశ్ మధ్య రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆమె తెలిపారు. అయితే బంగ్లా మీడియా మాత్రం ఆమెను తొలగించారనే వార్తలు వెలువరిస్తోంది. బీసీసీఐ ఆదేశాలతో ముస్తాఫిజూర్ రహ్మాన్‌ను విడుదల చేయడం, ఐపీఎల్ ప్రసారాలపై నిషేధం వంటి పరిణామాల మధ్య ఈ వార్తలు వెలువడ్డాయి. ఈ వివాదం క్రీడా రంగంపై ప్రభావం […]

Published By: HashtagU Telugu Desk
India vs Bangladesh: Ridhima Pathak

India vs Bangladesh: Ridhima Pathak

Ridhima Pathak బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ (బీపీఎల్) నుంచి భారత స్పోర్ట్స్ ప్రెజెంటర్ రిధిమా పాఠక్ స్వచ్ఛందంగా తప్పుకున్నట్లు స్పష్టం చేశారు. భారత్ – బంగ్లాదేశ్ మధ్య రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆమె తెలిపారు. అయితే బంగ్లా మీడియా మాత్రం ఆమెను తొలగించారనే వార్తలు వెలువరిస్తోంది. బీసీసీఐ ఆదేశాలతో ముస్తాఫిజూర్ రహ్మాన్‌ను విడుదల చేయడం, ఐపీఎల్ ప్రసారాలపై నిషేధం వంటి పరిణామాల మధ్య ఈ వార్తలు వెలువడ్డాయి. ఈ వివాదం క్రీడా రంగంపై ప్రభావం చూపుతోంది.

  • ముస్తాఫిజుర్ ఐపీఎల్ రిలీజ్ తర్వాత మారిన పరిస్థితులు
  • ఇదే సమయంలో బీపీఎల్ నుంచి బయటకొచ్చిన రిధిమా
  • తానే స్వచ్ఛందంగా వచ్చానంటూ నెట్టింట పోస్ట్

భారత్- బంగ్లాదేశ్ మధ్య క్రికెట్ సంబంధాలు రోజురోజుకూ మరింత ఉద్రిక్తంగా మారుతున్నాయి. ఇలాంటి సమయంలో బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ (బీపీఎల్) నుంచి భారత స్పోర్ట్స్ ప్రెజెంటర్ రిధిమా పాఠక్‌ను తొలగించారన్న వార్తలు సంచలనం సృష్టించాయి. అయితే ఈ ప్రచారాన్ని రిధిమా పూర్తిగా ఖండిస్తూ, బీపీఎల్ హోస్టింగ్ ప్యానెల్ నుంచి తప్పుకోవడం తన సొంత నిర్ణయమేనని స్పష్టం చేశారు.

ఇటీవల కాలంలో భారత్ – బంగ్లాదేశ్ మధ్య నెలకొన్న రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో, క్రికెట్ రంగంలో కూడా దాని ప్రభావం కనిపిస్తోంది. ఈ క్రమంలో బీపీఎల్ నుంచి రిధిమా పాఠక్‌ను బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ) తొలగించిందని అక్కడి మీడియా కథనాలు ప్రచారం చేశాయి. అయితే వాటికి రిధిమా సోషల్ మీడియా వేదికగా స్పష్టత ఇచ్చారు.

నన్ను తొలగించలేదు, నేను స్వయంగా తప్పుకున్నాను” అని రిధిమా పాఠక్ అధికారికంగా పేర్కొంది. “గత కొన్ని గంటలుగా నేను బీపీఎల్ నుంచి డ్రాప్ అయ్యానన్న ప్రచారం జరుగుతోంది. అది నిజం కాదు. ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని, నేను స్వయంగా ఈ లీగ్ నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నాను. నాకు ఎప్పుడూ నా దేశమే ముందు. ఏ ఒక్క అసైన్‌మెంట్‌కన్నా క్రికెట్‌పై నాకు ఉన్న గౌరవం చాలా ఎక్కువ” అని సోషల్ మీడియాలో ఆమె పోస్ట్ చేశారు.

సంవత్సరాలుగా ఈ ఆటకు నిజాయితీ, గౌరవం, అంకితభావంతో సేవ చేస్తున్నాను. అది ఎప్పటికీ మారదు. నేను ఎప్పుడూ క్రికెట్ విలువలు, నిజం, స్పష్టత కోసం నిలబడతాను. క్రికెట్‌కు నిజం కావాలి అంతే. ఇక ఈ విషయంపై మరిన్ని వ్యాఖ్యలు చేయను” అని పేర్కొన్నారు.

ఈ వివాదాలు అన్నింటికి ప్రధాన మూలం కోల్‌కతా నైట్ రైడర్స్ నుంచి బంగ్లాదేశ్ పేసర్ ముస్తాఫిజూర్ రహ్మాన్‌ను విడుదల చేయాలంటూ బీసీసీఐ ఆదేశించడమే. ఈ నిర్ణయం తర్వాత బంగ్లాదేశ్ ప్రభుత్వం ప్రతిస్పందిస్తూ ఐపీఎల్ ప్రసారాలపై దేశవ్యాప్తంగా నిషేధం విధించింది. టీ20 వరల్డ్‌కప్ మ్యాచ్‌లను భారత్ నుంచి శ్రీలంకకు మార్చాలంటూ ఐసీసీకి లేఖ రాసింది. ఈ పరిణామాల నేపథ్యంలోనే బీపీఎల్ నుంచి రిధిమా తప్పుకున్నారని ప్రచారం జరిగింది.

ఇక ఈ వ్యవహారంలో ఐసీసీ బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డుకు గట్టి హెచ్చరిక చేసినట్లు సమాచారం. భారత్‌లోనే టీ20 వరల్డ్‌కప్ మ్యాచ్‌లు ఆడాల్సిందేనని, లేకపోతే మ్యాచ్‌లు ఫోర్ఫిట్ అయ్యే ప్రమాదం ఉందని స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. దీంతో బీసీబీ ఆశలకు గట్టి ఎదురుదెబ్బ తగిలినట్టయింది. భారత్ – బంగ్లాదేశ్ మధ్య కొనసాగుతున్న ఈ వివాదం, కేవలం క్రికెట్‌కే కాకుండా ఇతర క్రీడా రంగాలపైనా ప్రభావం చూపే అవకాశాలు కనిపిస్తున్నాయి.

  Last Updated: 07 Jan 2026, 12:25 PM IST