Murali Vijay: అంతర్జాతీయ క్రికెట్ కు మురళీ విజయ్ గుడ్ బై

టీమిండియా వెటరన్ ఓపెనర్ మురళీ విజయ్ (Murali Vijay) అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలికాడు. తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని ట్విట్టర్ ద్వారా ప్రకటించాడు.తనకు సహకరించిన వారందికీ ధన్యవాదాలు తెలిపాడు. 16 ఏళ్ల పాటు టీమిండియాకు ప్రాతినిధ్యం వహించే అవకాశం లభించడం గౌరవంగా భావిస్తున్నాని విజయ్‌ తన ట్వీట్ లో పేర్కొన్నాడు.

  • Written By:
  • Publish Date - January 31, 2023 / 06:46 AM IST

టీమిండియా వెటరన్ ఓపెనర్ మురళీ విజయ్ (Murali Vijay) అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలికాడు. తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని ట్విట్టర్ ద్వారా ప్రకటించాడు.తనకు సహకరించిన వారందికీ ధన్యవాదాలు తెలిపాడు. 16 ఏళ్ల పాటు టీమిండియాకు ప్రాతినిధ్యం వహించే అవకాశం లభించడం గౌరవంగా భావిస్తున్నాని విజయ్‌ తన ట్వీట్ లో పేర్కొన్నాడు. తనకు అవకాశాలు కల్పించిన బీసీసీఐ, తమిళనాడు క్రికెట్‌ అసోసియేషన్‌, చెన్నై సూపర్‌ కింగ్స్‌, చెమ్‌ప్లాస్ట్‌ సన్మార్‌ ఫ్రాంచైజీల యజమాన్యాలకు విజయ్‌ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపాడు. తన సెకెండ్‌ ఇన్నింగ్స్‌ను క్రికెట్‌కు సంబంధించిన వ్యాపారంలో కొనసాగిస్తానని తెలిపాడు.

రిటైర్మెంట్‌ వయసుకు సంబంధించి విజయ్‌ ఇటీవలే కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఇండియన్‌ క్రికెట్‌లో 30 ఏళ్లు దాటితే 80 ఏళ్ల వృద్ధుడిలా చూస్తారని షాకింగ్‌ కామెంట్స్‌ చేశాడు. ఈ ప్రకటన చేసిన రోజుల వ్యవధిలోనే విజయ్‌ తన రిటైర్మెంట్‌ నిర్ణయాన్ని ప్రకటించాడు.

Also Read: Mangalvar Pooja: మంగళవారం ఆంజనేయస్వామిని ఈ విధంగా పూజిస్తే చాలు.. డబ్బే డబ్బు?

38 ఏళ్ల మురళి విజయ్‌.. టీమిండియా తరఫున 61 టెస్ట్‌లు, 17 వన్డేలు, 9 టీ20లు ఆడాడు. టెస్ట్‌ల్లో 12 సెంచరీలు, 15 హాఫ్‌ సెంచరీల సాయంతో 3982 పరుగులు చేసిన విజయ్‌.. వన్డేల్లో ఒక హాఫ్‌ సెంచరీ సాయంతో 339 పరుగులు, టీ20ల్లో 169 పరుగులు చేశాడు. ఐపీఎల్‌లో 106 మ్యాచ్‌లు ఆడిన విజయ్‌.. 2 సెంచరీలు, 13 హాఫ్‌ సెంచరీల సాయంతో 2619 పరుగులు చేశాడు. విజయ్‌ తన ఐపీఎల్‌ జర్నీలో చెన్నై సూపర్‌ కింగ్స్‌తో పాటు ఢిల్లీ డేర్‌డెవిల్స్‌‌, కింగ్స్‌ ఎలెవెన్‌ పంజాబ్‌ జట్లకు ప్రాతినిధ్యం వహించాడు. అలాగే కౌంటీల్లో ఎసెక్స్‌, సోమర్‌సెట్‌ జట్ల తరఫున ఆడాడు.