WPL 2024: 7 వికెట్ల తేడాతో ఆర్సీబీని ఓడించిన ముంబై ఇండియన్స్

మహిళల ప్రీమియర్ లీగ్ 2024 9వ మ్యాచ్‌లో ఆర్సీబీ డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్‌తో తలపడింది. గత మ్యాచ్‌లో ఇరు జట్లూ ఓటమి చవిచూశాయి. ఈ మ్యాచ్‌లో విజయం సాధించి పునరాగమనం చేయాలని ఇరు జట్లూ పోరాడాయి. అయితే ఈ ఉత్కంఠ పోరులో ముంబై పై చేయి సాధించింది.

WPL 2024: మహిళల ప్రీమియర్ లీగ్ 2024 9వ మ్యాచ్‌లో ఆర్సీబీ, డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్‌తో తలపడింది. గత మ్యాచ్‌లో ఇరు జట్లూ ఓటమి చవిచూశాయి. ఈ మ్యాచ్‌లో విజయం సాధించి పునరాగమనం చేయాలని ఇరు జట్లూ పోరాడాయి. అయితే ఈ ఉత్కంఠ పోరులో ముంబై పై చేయి సాధించింది.

మహిళల ప్రీమియర్ లీగ్ 9వ మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్‌ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ 6 వికెట్ల నష్టానికి 131 పరుగులు చేసింది. ఎల్లిస్ పెర్రీ అత్యధిక పరుగులు చేసింది. ఆమె 37 బంతుల్లో 44 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచింది. జార్జియా (27)తో కలిసి పెర్రీ ఆరో వికెట్‌కు 40 బంతుల్లో 52 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి జట్టును గౌరవప్రదమైన స్కోరు చేసింది. ముంబై తరఫున పూజా, కెప్టెన్ బ్రంట్ చెరో రెండు వికెట్లు తీశారు.

132 పరుగుల లక్ష్యాన్ని ముంబై జట్టు అత్యంత వేగంగా ఛేదించింది. మరో 29 బంతులు ఉండగానే 3 వికెట్లు కోల్పోయి 133 పరుగులతో విజయం సాధించింది. చివర్లో అమేలియా కెర్ అద్భుతంగా ఫోర్ కొట్టి ముంబై ఇండియన్స్‌ను 7 వికెట్ల తేడాతో గెలిపించింది. ఇన్నింగ్స్ లో అమేలియా కెర్ 24 బంతుల్లో 40 పరుగులతో సత్తా చాటింది. నాట్ స్కివర్ బ్రంట్‌ 27 పరుగులు, హేలీ మాథ్యూస్ 26 పరుగులు, యాస్తికా భాటియా కేవలం 15 బంతుల్లోనే 31 పరుగులతో సత్తా చాటింది. ఈ మ్యాచ్‌లో ముంబై తొలి బంతి నుంచి పూర్తి ఆధిపత్యం ప్రదర్శించి ఆర్‌సిబికి పునరాగమనం చేసే అవకాశం ఇవ్వలేదు.

ఆర్సీబీ జట్టు: స్మృతి మంధాన (కెప్టెన్), సోఫీ డివైన్, సబ్బినేని మేఘన, ఎల్లీస్ పెర్రీ, రిచా ఘోష్ (వికెట్ కీపర్), సోఫీ మోలినెక్స్, జార్జియా వేర్‌హామ్, శ్రేయంక పాటిల్, సిమ్రాన్ బహదూర్, ఆశా శోభన, రేణుకా ఠాకూర్ సింగ్.

ముంబై జట్టు: హేలీ మాథ్యూస్, యాస్తికా భాటియా (wk), నేట్ స్కివర్-బ్రంట్ (c), అమేలియా కెర్, పూజా వస్త్రాకర్, ఇస్సీ వాంగ్, S సజ్నా, అమంజోత్ కౌర్, హుమైరా కాజీ, కీర్తన్ బాలకృష్ణన్, సైకా ఇషాక్.

Also Read: Rashmika Mandanna : సినిమాకు సైన్ చేసే వాటిని కచ్చితంగా చూస్తా అంటున్న రష్మిక..!