Site icon HashtagU Telugu

Mumbai Indians: లక్నోపై ముంబై ఘ‌న‌విజ‌యం.. బుమ్రా సరికొత్త రికార్డు!

Mumbai Indians

Mumbai Indians

Mumbai Indians: ఐపీఎల్ 2025లో భాగంగా 45వ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ (Mumbai Indians), లక్నో సూపర్ జెయింట్స్ (Lucknow Super Giants) మ‌ధ్య జ‌రిగిన మ్యాచ్‌లో ముంబై జ‌ట్లు 54 పరుగుల తేడాతో ఘ‌న‌విజ‌యం సాధించింది. ఐపీఎల్ చరిత్రలో లీగ్ దశలో మొదటిసారిగా ముంబై లక్నోను ఓడించింది. 10 మ్యాచ్‌లలో ముంబైకి ఇది ఆరవ విజయం. దీంతో ముంబై ఇప్పుడు పాయింట్స్ టేబుల్‌లో రెండవ స్థానంలో నిలిచింది. ముంబై ఇండియన్స్ మొదట బ్యాటింగ్ చేసి 20 ఓవర్లలో 215 పరుగులు చేసింది. దీనికి బ‌దులుగా లక్నో జట్టు 161 పరుగులు మాత్రమే చేయగలిగింది. లక్నోకు 10 మ్యాచ్‌లలో ఇది ఐదవ ఓటమి. లక్నో జట్టు ఇప్పుడు పాయింట్స్ టేబుల్‌లో ఆరవ స్థానానికి చేరుకుంది.

బుమ్రా రికార్డు

వాంఖడే స్టేడియంలో ముంబై ఇండియన్స్, లక్నో సూపర్ జెయింట్స్ మధ్య మ్యాచ్‌లో జస్ప్రీత్ బుమ్రా ముంబై ఇండియన్స్ తరపున చరిత్ర సృష్టించాడు. ఈ మ్యాచ్‌లో బుమ్రా 4 వికెట్లు తీసి స‌త్తా చాట‌డంతో పాటు ముంబై తరపున అత్యంత విజయవంతమైన బౌలర్‌గా నిలిచాడు. బుమ్రా ఇప్పుడు ఐపీఎల్ చరిత్రలో ముంబై ఇండియన్స్ తరపున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా రికార్డు సృష్టించాడు. ఈ మ్యాచ్‌లో బుమ్రా మొత్తం 4 వికెట్లు తీసి ఎంఐ విజ‌యంలో కీల‌క పాత్ర పోషించాడు.

Also Read: SAARC Visa Exemption Scheme: భారతదేశం రద్దు చేసిన సార్క్ వీసా పథకం అంటే ఏమిటి?

ముంబై ఇండియన్స్ ఐపీఎల్‌లో అత్యంత విజయవంతమైన జట్లలో ఒకటి. ఈ జట్టులో అనేక గొప్ప బౌలర్లు ఆడారు. జట్టు తరపున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా ఇప్పుడు జస్ప్రీత్ బుమ్రా నిలిచాడు. అతను ఇప్పటివరకు 174 వికెట్లు సాధించాడు. బుమ్రా తన వేగవంతమైన బౌలింగ్, డెత్ ఓవర్లలో అద్భుతమైన ప్రదర్శనకు ప్రసిద్ధి చెందాడు. అతని తర్వాత లసిత్ మలింగా ఉన్నాడు. అతను ముంబై ఇండియన్స్ తరపున 170 వికెట్లు తీసుకున్నాడు. మలింగా యార్కర్ బంతులను ఆడటం బ్యాట్స్‌మెన్‌లకు చాలా కష్టంగా ఉండేది. మూడవ స్థానంలో హర్భజన్ సింగ్ ఉన్నాడు. అతని పేరిట 127 వికెట్లు నమోదయ్యాయి. ఇంకా మిచెల్ మెక్‌క్లెనాఘన్ 71, కీరన్ పొలార్డ్ 69, హార్దిక్ పాండ్యా 65 వికెట్లు తీసుకున్నారు.

ముంబైలో అత్య‌ధికంగా వికెట్లు తీసిన బౌల‌ర్లు