IPL 2024: ముంబై, గుజరాత్ చీకటి ఒప్పందం: హార్దిక్ కోసం 100 కోట్లు

హార్దిక్ పాండ్యా కోసం ముంబై, గుజరాత్ జట్ల మధ్య దాదాపు 100 కోట్ల నగదు మార్పిడి జరిగినట్లు విశ్వసనీయ సమాచారం. ఒక‌వేళ అదే నిజ‌మైతే ఐపీఎల్ చ‌రిత్ర‌లో అత్య‌ధిక‌ ధ‌ర ప‌లికిన ఆట‌గాడిగా పాండ్యా రికార్డు సృష్టిస్తాడు.

IPL 2024: ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్‌లో ఐదు సార్లు చాంపియ‌న్ ముంబై ఇండియ‌న్స్ ఆరో టైటిల్‌పై క‌న్నేసింది. 17వ సీజ‌న్‌ వేలానికి ముందే కొత్త కెప్టెన్‌ను నియ‌మించి సంచ‌ల‌నం సృష్టించింది. ఐదు ట్రోఫీలు అందించిన‌ రోహిత్ శ‌ర్మ‌ను కాదని హార్దిక్ ను కెప్టెన్ చేసి అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఇక ముంబై కెప్టెన్సీమార్పుతో కీలక పరిణామాలు చెవుటుచేసుకున్నాయి. హార్దిక్ పై రోహిత్ ఫాన్స్ దారుణంగా ట్రోల్స్ కు పాల్పడ్డారు. ఆ తర్వాత సోషల్ మీడియాలో పది లక్షల మంది ముంబైకి షాకిచ్చారు.

ప్రపంచకప్ లో గాయపడిన హార్దిక్ ఇంకా కోలుకోలేదని తెలుస్తుంది. పైగా వచ్చే ఏడాది ఐపీఎల్ సీజన్ కి దూరం కానున్నాడట. దీంతో ముంబైకి ఎం చేయాలో అర్ధం కావట్లేదు. ఇప్పుడు రోహిత్ ను మళ్ళీ కెప్టెన్ చేస్తే ఎలా ఉంటుంది? ఇంతకీ రోహిత్ ఒప్పుకుంటాడా ఇలా ఎన్నో ఆలోచనలు ముంబైని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. మరోవైపు హార్దిక్ పాండ్యా ఇష్యూ క్రికెట్ సర్కిల్స్‌లో తుఫాను సృష్టించింది.హార్దిక్ పాండ్యా గత రెండేళ్లుగా గుజరాత్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తూ జట్టును చక్కగా నడిపించాడు. అయితే పాండ్యాను తిరిగి జట్టులోకి తీసుకునేందుకు ముంబై ఇండియన్స్ తీవ్రంగా ప్రయత్నించింది.

హార్దిక్ పాండ్యా కోసం ముంబై ఇండియన్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య జరిగిన వాణిజ్య ఒప్పందం క్రికెట్ ప్రపంచాన్ని కుదిపేసింది. ఈ ఆల్ రౌండర్ కోసం ముంబై ఇండియన్స్ భారీ ట్రాన్స్ ఫర్ ఫీజు చెల్లించిందనే ఊహాగానాలు క్రికెట్ ప్రపంచాన్ని షాక్ కు గురి చేస్తున్నాయి. హార్దిక్ పాండ్యా కోసం ముంబై, గుజరాత్ జట్ల మధ్య దాదాపు 100 కోట్ల నగదు మార్పిడి జరిగినట్లు విశ్వసనీయ సమాచారం. ఒక‌వేళ అదే నిజ‌మైతే ఐపీఎల్ చ‌రిత్ర‌లో అత్య‌ధిక‌ ధ‌ర ప‌లికిన ఆట‌గాడిగా పాండ్యా రికార్డు సృష్టిస్తాడు. 2022లో గుజ‌రాత్ టైటాన్స్‌కు కెప్టెన్‌ గా ఛార్జ్ తీసుకుని తొలి సీజన్లోనే చాంపియ‌న్‌గా నిలిపాడు. అంతేకాదు రెండో సీజ‌న్‌లోనూ జ‌ట్టును ఫైన‌ల్‌కు చేర్చాడు. అయితే.. ధోనీ నేతృత్వంలోని చెన్నై సూప‌ర్ కింగ్స్ ఫైన‌ల్లో గుజ‌రాత్‌కు షాకిచ్చి టైటిల్ ఎగ‌రేసుకుపోయింది.

Also Read: Singareni Elections : సింగరేణి కార్మికులకు 20 లక్షల వడ్డీలేని రుణం – పొంగులేటి