Mumbai Indians: బ్రాండ్ వ్యాల్యూలో ఆ ఐపీఎల్ జట్టే టాప్

దేశాల మధ్య ఉన్న దూరాలను తొలగించేసిన టోర్నీ ఐపీఎల్.... ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రికెట్‌ అభిమానులందరినీ కలిపేసి సహచరులను ప్రత్యర్థుల్లా, ప్రత్యర్థుల్ని సహచరులగా మార్చేసింది.

  • Written By:
  • Publish Date - March 22, 2022 / 11:28 AM IST

దేశాల మధ్య ఉన్న దూరాలను తొలగించేసిన టోర్నీ ఐపీఎల్…. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రికెట్‌ అభిమానులందరినీ కలిపేసి సహచరులను ప్రత్యర్థుల్లా, ప్రత్యర్థుల్ని సహచరులగా మార్చేసింది. క్రికెట్‌ ప్రేమికుల ఫేవరెట్‌ టోర్నీగా నిలిచిన ఐపీఎల్‌ 2022 సీజన్ మరో 4 రోజుల్లోనే మొదలు కానుంది. రెండు కొత్త జట్ల రాకతో పెరిగిన మ్యాచ్‌ల కారణంగా ఈసారి ఐపీఎల్ మరింత రసవత్తరంగా సాగడం ఖాయంగా కనిపిస్తోంది.ఈ క్యాష్‌ రిచ్‌ లీగ్‌ వాంఖడే వేదికగా మార్చి 26 నుంచి ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్‌లో డిఫిండింగ్‌ ఛాంపియన్స్‌ చెన్నై సూపర్‌ కింగ్స్‌తో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ తలపడనుంది.

ఈ నేపథ్యంలో ఐపీఎల్ జట్ల బ్రాండ్ వ్యాల్యూ పై నివేదిక వచ్చింది. ఐపీఎల్ లో ఐదు సార్లు టైటిల్ విజేతగా నిలిచిన రోహిత్ శర్మ సారథ్యంలోని ముంబై ఇండియన్స్ జట్టు ఈ జాబితాలో టాప్ ప్లేస్ సాధించింది. ఆ జట్టు బ్రాండ్ వ్యాల్యూ 2700 కోట్లుగా ఉంది. అలాగే నాలుగు సార్లు టైటిల్ విజేతగా నిలిచిన ఎంఎస్ ధోని కెప్టెన్సీలోని చెన్నై సూపర్ కింగ్స్ జట్టు బ్రాండ్ వ్యాల్యూ 2500 కోట్లుగా ఉంది. ఇక రెండు సార్లు ఐపీఎల్ ట్రోఫీ విజేత శ్రేయాస్ అయ్యర్ సారథ్యంలోని కేకేఆర్ బ్రాండ్ వ్యాల్యూ 543 కోట్లుగా ఉండగా.. ఫాఫ్ డుప్లెసిస్ కెప్టెన్సీలోని రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు బ్రాండ్ వ్యాల్యూ 536 కోట్లుగా ఉంది. అలాగే కేన్ విలియంసన్ సారథ్యంలోని సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు బ్రాండ్ వ్యాల్యూ 442 కోట్లుగా ఉండగా.. రిషబ్ పంత్ కెప్టెన్సీలోని ఢిల్లీ క్యాపిటల్స్ బ్రాండ్ వ్యాల్యూ 370 కోట్లుగా ఉంది.. అలాగే మయాంక్ అగర్వాల్ సారథ్యంలోని పంజాబ్ కింగ్స్ జట్టు బ్రాండ్ వ్యాల్యూ 318 కోట్లుగా ఉండగా.. సంజు సాంసన్ సారథ్యంలోని రాజస్థాన్ రాయల్స్ బ్రాండ్ వ్యాల్యూ 249 కోట్లుగా ఉంది. ఎప్పటిలానే సీజన్ సీజన్ కూ ప్రతి జట్టు బ్రాండ్ వాల్యూ పెరుగుతుండడం విశేషం.