Site icon HashtagU Telugu

IPL 2024: రోహిత్ ను కెప్టెన్ గా తప్పించి విదేశీ ఆటగాళ్లపై ముంబై ఫోకస్

Rohit sharma- Hardik Pandya

IPL 2024

IPL 2024: టీమిండియా సారథి రోహిత్ శర్మ 2013లో ముంబై కెప్టెన్ గా బాధ్యతలు తీసుకున్నాడు. అదే ఏడాది ఐపీఎల్ టైటిల్ గెలిపించి సత్తా చాటాడు. ఆ తర్వాత, 2015, 2017, 2019 మరియు 2020లో రోహిత్ శర్మ నాయకత్వంలోని ముంబై ఇండియన్స్ ఛాంపియన్‌గా నిలిచి 5 సార్లు ఐపీఎల్ టైటిల్‌ను గెలుచుకున్న మొదటి జట్టుగా నిలిచింది. అయితే ఐపీఎల్ 2021 నుండి 2023 వరకు ముంబై ఆశించిన రీతిలో రాణించలేకపోయింది.దీంతో ముంబై గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యాను తమ జట్టులోకి తీసుకుంది. అంతేకాకుండా అతనిని కెప్టెన్‌గా నియమించింది. ఇక మరికొందరు ఆటగాళ్లపై ముంబై ఇండియన్స్ దృష్టి పెట్టింది.

2024 సీజన్ కు గానూ ముంబై ఇండియన్స్ పర్సులో కేవలం 17.75 కోట్లు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఈ వేలంలో ముంబై గరిష్టంగా 8 మంది ఆటగాళ్లను కొనుగోలు చేయగలదు, అందులో అత్యధికంగా 4 మంది విదేశీ ఆటగాళ్లు ఉండవచ్చు. ప్రస్తుతం ముంబై జట్టులో 17 మంది ఆటగాళ్లు ఉన్నారు. ముంబై ఇండియన్స్ విదేశీ ఫాస్ట్ బౌలర్లను కొనుగోలు చేయాలనుకుంటుందట. దీనికి రీజన్ వేలానికి ముందు 5 మంది విదేశీ ఫాస్ట్ బౌలర్లను విడుదల చేసింది, వారిలో ఒకరు జోఫ్రా ఆర్చర్. కాబట్టి ముంబై జట్టు తమ బడ్జెట్‌కు అనుగుణంగా కనీసం ఒక్క ఫాస్ట్ బౌలర్‌నైనా జట్టులోకి తీసుకునేందుకు కచ్చితంగా ప్రయత్నిస్తుంది. ఇందులో మిచెల్ స్టార్క్, పాట్ కమ్మిన్స్, గెరాల్డ్ కోసీ లేదా దక్షిణాఫ్రికా యువ లెఫ్టార్మ్ ఫాస్ట్ బౌలర్ బురాన్ హెండ్రిక్స్ వంటి బౌలర్లు ఉండవచ్చు. ముంబై జట్టు కెమెరూన్ గ్రీన్‌ను కూడా విడుదల చేసింది, అతని స్థానంలో కీరన్ పొలార్డ్‌కు అవకాశం ఇవ్వాలని జట్టు ప్రయత్నించింది. ప్రస్తుతం జట్టుని గమనిస్తే ముంబైకి ఒక స్పిన్నర్ లేదా ఇద్దరు అవసరం పడుతుంది. ప్రస్తుతం వారి జట్టులో పీయూష్ చావ్లా మరియు కుమార్ కార్తికేయ మినహా ప్రత్యేక స్పిన్ విభాగం కనిపించడం లేదు. అందువల్ల ఆఫ్ఘనిస్తాన్‌కు చెందిన ముజీబ్ ఉర్ రెహ్మాన్ మరియు శ్రీలంకకు చెందిన వనిందు హసరంగాపై ఫోకస్ పెట్టనుంది.

Also Read: Tamilnadu: పొంగిపొర్లుతున్న కుట్రాలం జలపాతం, క్యూ కడుతున్న ప్రకృతి ప్రేమికులు