Site icon HashtagU Telugu

WPL 2024: 42 పరుగుల తేడాతో యూపీ వారియర్స్‌పై ముంబై ఇండియన్స్ విజయం

WPL 2024

WPL 2024

WPL 2024: మహిళల ప్రీమియర్ లీగ్ 14వ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ 42 పరుగుల తేడాతో యూపీ వారియర్స్‌పై విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 160 పరుగులు చేసింది. లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో యూపీ వారియర్స్ 9 వికెట్ల నష్టానికి 118 పరుగులు మాత్రమే చేయగలిగింది.

టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. ముంబైకి సరైన ఆరంభం దక్కలేదు. 17 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది. 76 పరుగుల వద్ద, నేట్ సివర్ బ్రంట్ (45) రూపంలో జట్టుకు మూడో దెబ్బ తగిలింది. అదే సమయంలో కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (33) కూడా 104 పరుగుల వద్ద పెవిలియన్‌కు చేరింది. అమేలియా కెర్ 23 బంతుల్లో 39 పరుగులు చేసింది. అమన్‌జోత్ 7 పరుగులు నమోదు చేసింది. ఎస్ సంజన 14 బంతుల్లో 22 పరుగులు చేసింది. యూపీ తరఫున చమరి అటపట్టు రెండు వికెట్లు, గైక్వాడ్, దీప్తి శర్మ, సైమా ఠాకోర్ తలా ఒక వికెట్ తీశారు.

ముంబై ఇచ్చిన 161 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో యూపీకి ఆరంభం పేలవంగానే సాగింది. 15 పరుగుల వద్ద మూడు వికెట్లు కోల్పోయింది. కెప్టెన్ అలిస్సా హీలీ మూడు పరుగులు, కిరణ్ నవ్‌గిరే 7 పరుగులు చేశారు. చమరి అటపట్టు 3 పరుగులతో నిరాశపరిచారు. గ్రేస్ హారిస్ 15 పరుగుల ఇన్నింగ్స్ ఆడింది. 17 పరుగుల వద్ద శ్వేతా సెహ్రావత్ ఔటైంది. ఆల్ రౌండర్ దీప్తి శర్మ 36 బంతుల్లో 53 పరుగులతో అజేయ ఇన్నింగ్స్ ఆడింది. అయితే దీప్తి అద్భుతంగా ఆడినప్పటికీ జట్టుకు విజయాన్ని అందించలేకపోయింది. ముంబై తరఫున సైకా ఇషాక్ మూడు వికెట్లు, నేట్ సివర్ బ్రంట్ రెండు వికెట్లు తీశారు. ఇస్మాయిల్‌, హేలీ మాథ్యూస్‌, పూజా వస్త్రాకర్‌ తలో వికెట్‌ తీశారు.

Also Read: Hyderabad: హైదరాబాద్‌లో ఉద్యోగులకు సెలవులు రద్దు.. ఎందుకంటే..?

Exit mobile version