SRH vs MI: హోం గ్రౌండ్ లో సన్ రైజర్స్ కు ముంబై పంచ్

ఐపీఎల్ 16వ సీజన్ లో ముంబై హ్యాట్రిక్ విజయం అందుకుంది. ఉప్పల్ స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్ లో ముంబై 14 రన్స్ తేడాతో సన్ రైజర్స్ హైదరాబాద్ పై విజయం సాధించింది.

  • Written By:
  • Publish Date - April 18, 2023 / 11:28 PM IST

SRH vs MI: ఐపీఎల్ 16వ సీజన్ లో ముంబై హ్యాట్రిక్ విజయం అందుకుంది. ఉప్పల్ స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్ లో ముంబై 14 రన్స్ తేడాతో సన్ రైజర్స్ హైదరాబాద్ పై విజయం సాధించింది. భారీ స్కోరును చేజ్ చేయడంలో సన్ రైజర్స్ విఫలమయింది.
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ముంబై ఇండియన్స్ కు ఓపెనర్లు రోహిత్ శర్మ , ఇషాన్ కిషన్ బంతుల్లో మంచి ఆరంభం ఇచ్చారు. వరుస బౌండరీలతో సన్‌రైజర్స్ బౌలర్లను ఆదుకున్నారు.ఈ జోడీని నటరాజన్ విడదీసాడు. రోహిత్ ఔట్ అయ్యాక క్రీజులో వచ్చిన కామెరూన్ గ్రీన్‌తో కలిసి ఇషాన్ కిషన్ దూకుడుగా ఆడాడు. దీంతో
ముంబై పవర్ ప్లేలో వికెట్ నష్టానికి 53 పరుగులు చేసింది. ఇషాన్ ధాటిగా ఆడినా గ్రీన్ ఆరంభంలో కాస్త నెమ్మదిగా ఆడాడు. అయితే ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్ వెంట వెంటనే క్యాచ్ ఔట్ చేయడంతో ముంబై ఇబ్బందుల్లో పడినట్టు కనిపించింది. ఈ దశలో లోకల్ ప్లేయర్ తిలక్ వర్మ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. భారీ సిక్సర్లతో స్కోర్ బోర్డును పరుగెత్తించాడు. తన ఫామ్ కొనసాగిస్తూ తిలక్ వర్మ 17 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్స్‌లతో 37 రన్స్ చేయగా…గ్రీన్ 33 బంతుల్లో తొలి ఐపీఎల్ హాఫ్ సెంచరీ సాధించాడు. చివరి ఓవర్‌లో టీమ్ డేవిడ్ రెండు ఫోర్లు కొట్టడంతో
ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 192 పరుగులు చేసింది. సన్‌రైజర్స్ బౌలర్లలో మార్కో జాన్సెన్ రెండు వికెట్లు తీయగా.. నటరాజన్, భువనేశ్వర్ కుమార్ తలో వికెట్ పడగొట్టారు.

భారీ టార్గెట్ చేదించే క్రమంలో సన్ రైజర్స్ హైదరాబాద్ ఇన్నింగ్స్ తడబడుతూ సాగింది. గత మ్యాచ్ లో సెంచరీ హీరో బ్రూక్ 9 రన్స్ కే ఔటవగా..రాహుల్ త్రిపాఠి, అభిషేక్ శర్మ కూడా నిరాశ పరిచార. అయితే మయాంక్ అగర్వాల్ , కెప్టెన్ మక్ రమ్ ఇన్నింగ్స్ గాడిన పెట్టేందుకు ప్రయత్నించారు. వీరిద్దరి పార్టనర్ షిప్ తో కోలుకున్నట్టే కనిపించినా…మక్ రమ్ ఔట్ తో వారి జోరుకు బ్రేక్ పడింది. తర్వాత వికెట్ కీపర్ క్లాసెన్ మెరుపులతో మళ్లీ విజయంపై ఆశలు నిలిచాయి.
భారీ షాట్లతో అదరగొట్టిన క్లాసెన్ కేవలం 16 బంతుల్లో 4 ఫోర్లు , 2 సిక్సర్లతో 36 రన్స్ చేసి కీలక సమయంలో వెనుదిరిగాడు. ఇంపాక్ట్ ప్లేయర్ గా వచ్చిన అబ్దుల్ సమద్ తీవ్రంగా నిరాశ పరిచాడు. మిగిలిన బ్యాటర్లు కూడా చేతులెత్తేయడంతో సన్ రైజర్స్ 178 రన్స్ కే పరిమితమయింది. చివరి ఓవర్లో 19 రన్స్ చేయాల్సి ఉండగా…బంతిని అందుకున్న సచిన్ కుమారుడు అర్జున్ టెండూల్కర్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. ఒత్తిడిలో కేవలం 4 పరుగులు ఇచ్చి 1 వికెట్ తీశాడు. ఈ సీజన్ లో ముంబైకి ఇది మూడో విజయం.