Site icon HashtagU Telugu

WPL Champions: WPL విజేత ముంబై ఇండియన్స్

Mi Win

Mi Win

WPL Champions: మహిళల ఐపీఎల్ తొలి సీజన్ లో ముంబై ఇండియన్స్ ఛాంపియన్ గా నిలిచింది. ఫైనల్లో ఆ జట్టు 7 వికెట్ల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్ పై విజయం సాధించింది. ముంబై స్టార్ బ్యాటర్ సీవర్ మరోసారి విధ్వంసకర ఇన్నింగ్స్ తో చెలరేగి జట్టును గెలిపించింది.
టాస్‌ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 131 పరుగులు చేసింది. 79 పరుగులకే 9 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డ ఢిల్లీను రాధా యాదవ్‌, శిఖా పాండే అదుకున్నారు. వీరిద్దరూ ఆఖరి వికెట్‌కు 52 పరుగుల కీలక బాగస్వామ్యం నెలకొల్పారు. రాధా యాదవ్‌ 27, శిఖా పాండే 27 పరుగులు సాధించారు. ఢిల్లీ కెప్టెన్‌ లానింగ్‌ 35 పరుగులతో రాణించింది. ముంబై బౌలర్లలో వాంగ్‌, మాథ్యూస్‌ తలా మూడు వికెట్లు సాధించగా.. కేర్‌ రెండు వికెట్లు పడగొట్టింది.

132 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై ఆదిలోనే రెండు వికెట్లు కోల్పోయింది. రాధాయాదవ్‌ బౌలింగ్‌లో యస్తికా భాటియా 4 పెవిలియన్‌కు చేరగా.. జానెసన్‌ బౌలింగ్‌లో మాథ్యూస్‌ 13 ఔటైంది. అయితే కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ , స్టార్ ఆల్ రౌండర్ సీవర్ ఆదుకున్నారు.
ఢిల్లీకి అవకాశం ఇవ్వకుండా కీలక భాగస్వామ్యం నెలకొల్పారు. హర్మన్ 37 రన్స్ కు ఔటైనా…సీవర్ 60 పరుగులతో ఆఖరి వరకు క్రీజులో నిలిచి తమ జట్టును ఛాంపియన్స్‌గా నిలిపింది. ముంబై 19.3 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి టార్గెట్ ఛేదించింది.

Exit mobile version