Site icon HashtagU Telugu

IPL 2023: గాయం కారణంగా చెన్నై బౌలర్ ముఖేష్ చౌదరి ఐపీఎల్‌కు దూరం.. అతని స్థానంలో జట్టులోకి ఎవరు వచ్చారంటే..?

Mukesh Choudhary

Resizeimagesize (1280 X 720) (1)

ఐపీఎల్ (IPL 2023) 16వ ఎడిషన్ నేటి నుంచి ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్‌లో నాలుగుసార్లు ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్, డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్ జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌కు ముందే సీఎస్‌కే భారీ దెబ్బ తగిలింది. గత సీజన్‌లో సీఎస్‌కే తరఫున అద్భుతంగా బౌలింగ్ చేసిన ముఖేష్ చౌదరి (Mukesh Choudhary) ఈ ఏడాది ఐపీఎల్ ఆడడం లేదు. గాయం కారణంగా మొత్తం సీజన్‌కు ముఖేష్ చౌదరి దూరం అయ్యారు. అతని స్థానంలో మరో యంగ్ ప్లేయర్ పేరును CSK ప్రకటించింది. శుక్రవారం నుంచి ప్రారంభం కానున్న ఐపీఎల్ 16వ ఎడిషన్‌లో గాయపడిన ముఖేష్ చౌదరి స్థానంలో ఫాస్ట్ బౌలర్ ఆకాష్ సింగ్‌ను చెన్నై సూపర్ కింగ్స్ చేర్చుకుంది.

పవర్‌ప్లే సమయంలో ముఖేష్ తన స్వింగ్ బౌలింగ్‌తో ఆకట్టుకున్నాడు. గత సీజన్ లో 13 మ్యాచ్‌లలో 4/46 అత్యుత్తమ గణాంకాలతో 16 వికెట్లు తీశాడు. 2020లో భారత అండర్-19 ప్రపంచకప్ జట్టులో భాగమైన ఆకాష్ సింగ్ గతంలో రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడాడు. అతని పేరు మీద 31 వికెట్లు ఉన్నాయి. ఆకాష్ సింగ్‌ను చెన్నై సూపర్ కింగ్స్ జట్టు రూ. 20 లక్షల రూపాయల బేస్ ప్రైస్‌తో జట్టులో చేర్చుకుంది. ఆకాష్ సింగ్ 2020లో భారత అండర్-19 ప్రపంచకప్ జట్టులో సభ్యుడు. ఇప్పటి వరకు ఆకాష్ సింగ్ కెరీర్ ను పరిశీలిస్తే ఈ యువ ఆటగాడు ఇప్పటి వరకు తొమ్మిది టీ20 మ్యాచ్‌లు ఆడగా అందులో 34.85 సగటుతో ఏడు వికెట్లు పడగొట్టాడు.

టోర్నీ ప్రారంభానికి ముందే చెన్నై రెండు ఎదురుదెబ్బలు తగిలాయి. ముఖేష్ చౌదరి కంటే ముందు గాయం కారణంగా టోర్నమెంట్ నుండి వైదొలిగిన ఆల్ రౌండర్ కైల్ జేమీసన్ రూపంలో జట్టుకు మొదటి దెబ్బ తగిలింది. అతని స్థానంలో దక్షిణాఫ్రికా ఆల్‌రౌండర్‌ సిసంద మగలాను జట్టులోకి తీసుకున్నారు.

ఐపీఎల్‌లో ఇప్పటివరకు ఎనిమిది మంది ఆటగాళ్లు టోర్నీకి దూరమయ్యారు. వీరిలో ముఖేష్‌తో పాటు జస్‌ప్రీత్ బుమ్రా, రిషబ్ పంత్, జానీ బెయిర్‌స్టో, కైల్ జేమ్సన్, విల్ జాక్వెస్, శ్రేయాస్ అయ్యర్, ప్రసిద్ధ కృష్ణ వంటి క్రికెటర్లు ఉన్నారు. రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు క్రికెటర్ల గాయం వల్ల ఎక్కువగా నష్టపోగా, సన్‌రైజర్స్ హైదరాబాద్, డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్ మాత్రమే ఇప్పటివరకు గాయాల బారిన పడలేదు.

చెన్నై సూపర్ కింగ్స్ జట్టు: మహేంద్ర సింగ్ ధోని (కెప్టెన్), డెవాన్ కాన్వే, రుతురాజ్ గైక్వాడ్, అంబటి రాయుడు, మొయిన్ అలీ, బెన్ స్టోక్స్, రవీంద్ర జడేజా, అజింక్యా రహానె, సిసంద మగల, రవీంద్ర జడేజా, శివమ్ దూబే, డ్వేన్ ప్రిటోరియస్, అహయ్ మొండల్, నిశాంత్ సింధు,రాజవర్ధన్ హంగర్‌గేకర్, మిచెల్ సాంట్నర్, సుభ్రాంశు సేనాపతి, సిమర్‌జీత్ సింగ్, మతిసా పతిరానా, మహేష్ తీక్షణ, భగత్ వర్మ, ప్రశాంత్ సోలంకి, షేక్ రషీద్, తుషార్ దేశ్‌పాండే, ఆకాష్ సింగ్.

Exit mobile version