Site icon HashtagU Telugu

MS Dhoni: నయా లుక్‌లో ధోనీ

Ms Dhoni

Ms Dhoni

ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐపీఎల్ 2022 ప్రారంభానికి ముందు చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ఎంఎస్‌ ధోని కొత్త లుక్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఫుల్ మాస్ లుక్ లో ఉన్న ధోనిని చూసి అభిమానులు షాక్‌ తిన్నారు. ఇక మార్చి 26 నుంచి మే 29 వరకు ఐపీఎల్‌ 2022 సీజన్ మ్యాచ్‌లు జరగనుండగా.. ఇప్పటికే ధోనీ.. రాంచి మైదానంలో ప్రాక్టీస్ ప్రారంభించాడు.. ఊర మాస్ లుక్ ఉన్న ధోని ఫోటోను ఐపీఎల్ అధికారిక బ్రాడ్ కాస్టర్ సంస్థ స్టార్ స్పోర్ట్స్ తన ట్విటర్‌లో షేర్ చేసింది.

నిజానికి ఎంఎస్ ధోనీ అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టినప్పుడు అతని ఆట కంటే జులపాల జుట్టు గురించే ఎక్కువగా చర్చ జరిగింది.. ఆ తర్వాత 2011లో టీమిండియా వన్డే ప్రపంచకప్ గెలిచాక గుండు చేసుకున్న ధోనీ.. ఐపీఎల్‌ 2020కి ముందు గుబురు గడ్డం, లేయర్డ్ హెయిర్‌తో కనిపించాడు. ఆ తర్వాత ఐపీఎల్ 2021 ముంగిట ధోనీ సన్యాసి అవతారంలో కూడా కనువిందు చేశాడు.. తాజాగా ఐపీఎల్ 2022 సీజన్ కోసం ఊర మాస్ లుక్ లో మహేంద్రుడు దర్శనమిచ్చాడు.. ఇక ధోని సరికొత్త లుక్ పై నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. ఈ లుక్ లో కూడా ధోని ఫుల్ స్టైలిష్ గా ఉన్నాడని కామెంట్లు చేస్తున్నారు…

ఇక ఎంఎస్ ధోనీ తన కెరీర్ లో 350 వన్డేల్లో 10773 పరుగులు, 90 టెస్టుల్లో 4876 పరుగులు, 98 టీ20ల్లో 1617 పరుగుల సాధించాడు. ఇందులో వన్డేల్లో 10 సెంచరీలు, టెస్టుల్లో 6 సెంచరీలు సాధించాడు. 2007‌లో టీ20 ప్రపంచకప్, 2011లో వన్డే ప్రపంచకప్, 2013లో ఛాంపియన్స్ ట్రోఫీ గెలవడం ద్వారా.. ఈ మూడు ఐసీసీ టోర్నీలు గెలిచిన ఏకైక కెప్టెన్‌గా రికార్డ్ సాధించాడు.అలాగే ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీకి నాలుగు టైటిళ్లు అందించాడు.

Exit mobile version