IPL 2024: ఐపీఎల్ 2024 కి ముందు ధోని రిటైర్‌మెంట్ హింట్

టీమిండియాకు మూడు ఐసీసీ ట్రోఫీలు అందించి ప్రపంచ క్రికెటర్లలో దిగ్గజ ఆటగాడిగా, కెప్టెన్ గా కితాబు అందుకున్నాడు ధోనీ. మాహీ సరిగ్గా 2020 ఆగస్టు 15న రిటైర్మెంట్ అన్నౌన్స్ చేసి కోట్లాది మంది అభిమానుల్ని కంటతడి పెట్టించాడు.

IPL 2024: టీమిండియాకు మూడు ఐసీసీ ట్రోఫీలు అందించి ప్రపంచ క్రికెటర్లలో దిగ్గజ ఆటగాడిగా, కెప్టెన్ గా కితాబు అందుకున్నాడు ధోనీ. మాహీ సరిగ్గా 2020 ఆగస్టు 15న రిటైర్మెంట్ అన్నౌన్స్ చేసి కోట్లాది మంది అభిమానుల్ని కంటతడి పెట్టించాడు. కానీ ఎంత పెద్ద ఆటగాడైన వీడ్కోలు పలకాల్సిందే కాబట్టి ధోనీని కూడా ఫ్యాన్స్ కన్సిడర్ చేశారు.

మాహీ ప్రస్తుతం ఐపీఎల్ లో మాత్రమే ఆడుతున్నాడు. ఈ ఏడాది ఈ ఫార్మేట్ కి కూడా గుడ్ బై చెప్పనున్నాడు. ఇది జీర్ణించుకోలేని సీజన్ అని ఇప్పటికే అభిమానులు కలత చెందుతున్నారు. ఎంఎస్ ధోని సారథ్యంలో సీఎస్‌కే ఐదు సార్లు టైటిల్ గెలుచుకుంది. ఈ ఏడాది చివరి టైటిల్ గెలిచి ధోనీకి ఘనంగా వీడ్కోలు పలకాలని చెన్నై సూపర్ కింగ్స్ భావిస్తుంది. ఇదిలా ఉండగా ధోనీ తాజా పోస్టుతో అభిమానులు ఉలిక్కిపడ్డారు. సడెన్ గా రిటైర్మెంట్ ప్రకటించే అలవాటున్న ధోనీ ఎప్పుడు ఆ బ్యాడ్ న్యూస్ చెప్తాడోనని టెన్షన్ పడుతూనే ఉన్నారు. తాజాగా మాహీ అదే పని చేశాడు.

కొత్త సీజన్-కొత్త రోల్ కోసం వేచి ఉండలేకపోతున్నాను అని ధోని ఫేస్‌బుక్‌లో పోస్ట్ పెట్టాడు.దీంతో ధోని ఆట‌కు వీడ్కోలు చెప్ప‌నున్నాడా అనే చ‌ర్చ మొదలైంది. ధోని క్రికెటర్ గా కాకుండా కోచ్‌గా బాధ్యతలు తీసుకోబోతున్నాడని కొందరు భావిస్తున్నారు. ఆ కొత్త రోల్ ఏంటో చెప్పు మాహీ అంటూ కామెంట్స్ చేస్తున్నారు ఫ్యాన్స్. మరికొందరైతే ధోనీ రిటైర్మెంట్ హింట్ ఇచ్చేశాడు అంటూ ఎమోషనలవుతున్నారు. కాగా ఈ ఏడాది ఐపీఎల్ మార్చి 22న ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్‌లో చెన్నై సూప‌ర్ కింగ్స్‌తో రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు జ‌ట్టు త‌ల‌ప‌డ‌నుంది.

Also Read: T20 World Cup 2024: భారత్-పాక్ హైఓల్టేజ్ మ్యాచ్.. ఒక్కో టిక్కెట్ ధర 1.86 కోట్లు