Site icon HashtagU Telugu

IPL 2023 : ధోని ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్…ఏంటో తెలుసా..?

Ms Dhoni

Ms Dhoni

IPL 2023…ఆరంభానికి ఇంకా 6 నెలల సమయం ఉంది. ఈ టోర్నమెంట్ లో వేర్వేరు ఫ్రాంచైజీల ఆటగాళ్లు అందరూ తమ దేశం తరపున ఆడుతున్నారు. ఆసియా కప్ 2022 కౌంటి లీగ్ రంజీ మ్యాజ్ లో పాల్గొంటున్నారు. అక్టోబర్ లో ప్రారంభం కానున్న T20ప్రపంచ కప్ టోర్నమెంట్ కోసం ఆయా ప్లేయర్లు సమాయత్తమవుతున్నారు. ఈ నేపథ్యంలో ధోని ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ చెప్పాడు. IPL2023లో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ధోని కొసాగనున్నారు. ఈ మేరకు CSKచీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీర్ కాశీ విశ్వనాథన్ వెల్లడించారు.

ఈ విషయాన్ని ధ్రువీకరిస్తూ వన్ ఇండియా ట్వీట్ చేసింది. ధోనీ సారథ్యంలో తాము IPL2023లో ఆడబోతున్నామని కాశీ విశ్వనాథన్ స్పష్టం చేసినట్లు ప్రకటించింది. కాగా ఐపీఎల్ 2022 లో చెన్నై సూపర్ కింగ్స్ ఆశించిన స్థాయిలో ఆడలేదన్న సంగతి తెలిసిందే.

Exit mobile version