Site icon HashtagU Telugu

MS Dhoni : తానూ ధోనీ టైప్ అంటున్న డుప్లెసిస్

Faf Du Plessis

Faf Du Plessis

ఐపీఎల్ 2022 సీజన్ ముంగిట అంతా అనుకున్న‌ట్టుగానే దక్షిణాఫ్రికా స్టార్ బ్యాటర్, చెన్నై సూపర్ కింగ్స్ మాజీ ఓపెనర్ ఫాఫ్ డుప్లెసిస్‌కే ఆర్సీబీ యాజమాన్యం సారథ్య బాధ్య‌ల‌ను అప్ప‌గించింది. ఆ జట్టు కెప్టెన్సీ రేసులో ఆస్ట్రేలియా ఆల్‌రౌండ‌ర్ గ్లెయిన్ మాక్స్‌వెల్‌, టీమిండియా వికెట్ కీప‌ర్ దినేష్ కార్తీక్ పేర్లు కూడా వినిపించిన‌ప్ప‌టికీ ఆర్సీబీ మేనేజ్‌మెంట్ అనుభ‌వ‌జ్ఞుడైన ఫాఫ్ డుప్లెసిస్ వైపే మొగ్గు చూపింది. ఈ నేపథ్యంలో కొత్త కెప్టెన్ డుప్లెసిస్ ఎంఎస్ ధోనీ, విరాట్ కోహ్లీల కెప్టెన్సీ విధానంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు…

తాజాగా ఓ కార్యక్రమంలో ఫాఫ్ డుప్లెసిస్ మాట్లాడుతూ.. ఆర్సీబీ లాంటి గొప్ప ఫ్రాంఛైజీకి కెప్టెన్ గా ఉండడం నా అదృష్టం. నా సుదీర్ఘ కెరీర్లో ఎంతో మంది దిగ్గజ సారథులతో పనిచేశాను. దక్షిణాఫ్రికా దిగ్గజ కెప్టెన్ గ్రేమ్ స్మిత్, టీమిండియా దిగ్గజ సారథి ఎంఎస్ ధోనీల సారథ్యంలో ఆడాను. అయితే ఎంఎస్ ధోనీ ఆలోచనలు నా ఆలోచనలు ఒకేలా ఉంటాయి. ఇద్దరం ఎల్లప్పుడు కూల్ గా ఉంటాం. ధోనీ సారథ్యంలో సీఎస్కేలో ఆడిన తర్వాత అతని నుంచి చాలా నేర్చుకున్నాను.. ఇక కోహ్లీ కెప్టెన్సీ భిన్నంగా ఉంటుంది.. అతడో గొప్ప సారథి. ఈ ఐపిఎల్ లో అతడు నాకు అండగా ఉంటాడు. అతని సహకారంతో జట్టును నడిపిస్తా అని డుప్లెసిస్ చెప్పుకొచ్చాడు.
ఇదిలావుంటే.. ఐపీఎల్‌-2022 మెగా వేలంలో డు ప్లెసిస్‌ను ఆర్సీబీ రూ. 7కోట్లకు కొనుగోలు చేసింది. ఇక అంతకుముందు చెన్నై సూపర్‌ కింగ్స్‌ తరుపున ఆడిన డు ప్లెసిస్‌.. గతేడాది ఐపీఎల్‌లో 633 పరుగులు చేసి టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన రెండో ఆటగాడిగా నిలిచాడు.