Site icon HashtagU Telugu

MS Dhoni: చెన్నై జట్టుకు భారీ షాక్.. ఎంఎస్ ధోనీకి గాయం..!

Dhoni As Uncapped Player

Dhoni As Uncapped Player

IPL 2023 మొదటి మ్యాచ్ చెన్నై సూపర్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య జరగనుంది. అయితే CSK శిబిరం నుండి ఒక బ్యాడ్ న్యూస్ బయటకు వచ్చింది. ఇది తెలిసిన తర్వాత అభిమానులు నిరాశకు గురవుతున్నారు. చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ (MS Dhoni) గాయం కారణంగా తొలి మ్యాచ్‌కు దూరం కావచ్చనే వార్తలు వస్తున్నాయి. ప్రాక్టీస్ సెషన్‌లో ధోనీ ఎడమ మోకాలి గాయం కారణంగా ఇబ్బంది పడ్డాడు. ఇప్పుడు అతను మొదటి మ్యాచ్‌కు దూరమయ్యేందుకు గాయం కారణమని తెలుస్తోంది. అయితే తొలి మ్యాచ్ కు ముందు ధోని గాయపడడంతో చెన్నై కష్టాలు ఎక్కువయ్యాయి.

చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ఫిట్‌నెస్ విషయంలో ఎలాంటి రిస్క్ తీసుకోవాలనుకోవడం లేదు. దీని కారణంగా అతను మొదటి మ్యాచ్‌కు దూరమయ్యే అవకాశం ఉంది. మీడియా నివేదికల ప్రకారం.. MS ధోని ప్రస్తుతం పూర్తి ఫిట్‌గా లేడని, దాని గురించి అతను చాలా జాగ్రత్తగా ఉన్నాడని సమాచారం. ఈ గాయం కారణంగా గురువారం జరిగిన శిక్షణలో కూడా పాల్గొనలేదు.

Also Read: IPL 2023 Preview: ఐపీఎల్ కార్నివాల్‌కు అంతా రెడీ

చెన్నైలో ప్రాక్టీస్ సెషన్‌లో 41 ఏళ్ల ఎంఎస్ ధోని ఎడమ మోకాలికి గాయమైంది. మోటెరాలోని నరేంద్ర మోదీ స్టేడియంలో గురువారం ప్రాక్టీస్‌లో అతను బ్యాటింగ్ చేయలేదు. దీనిపై సీఎస్‌కే సీఈవో కాశీ విశ్వనాథన్‌ని ప్రశ్నించగా.. నా విషయానికి వస్తే కెప్టెన్‌ 100 శాతం ఆడతాడని చెప్పాడు. ఇతర పరిణామాల గురించి నాకు తెలియదని అన్నారు. ధోనికి గాయమైందన్న సమాచారంతో ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. ధోనికి నిజంగానే గాయమైందా? కేవలం మొదటి మ్యాచ్ కు మాత్రమే దూరంగా కానున్నారా? మిగతా మ్యాచ్ ల పరిస్థితి ఏంటని అభిమానులు ప్రశ్నలు కురిపిస్తున్నారు.

ధోనీ లేకపోవడంతో చెన్నై సూపర్ కింగ్స్ కూడా వికెట్ కీపర్ ను వెతుకోవాల్సి వస్తుంది. ధోనీ శుక్రవారం ఆడకపోతే అతని స్థానంలో బెన్ స్టోక్స్‌కు జట్టు కెప్టెన్సీ ఇవ్వవచ్చు. ఇటువంటి పరిస్థితిలో రవీంద్ర జడేజా,రితురాజ్ గైక్వాడ్‌ను కూడా ఎంపికగా చూడవచ్చు. ఎంఎస్ ధోనీ మ్యాచ్ సందర్భంగా గురువారం నరేంద్ర మోదీ స్టేడియంలో ప్రాక్టీస్ సెషన్ కోసం వచ్చాడు. కానీ అతను నెట్స్‌లో బ్యాటింగ్ చేయలేదు. కాగా ధోని గాయంపై చెన్నై యాజమాన్యం ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన చేయలేదు.