Site icon HashtagU Telugu

MS Dhoni Retirement: ఐపీఎల్‌కు ఎంఎస్ ధోనీ గుడ్‌బై..? ఎమోషనల్ వీడియో పోస్ట్ చేసిన సీఎస్‌కే..!

Dhoni As Uncapped Player

Dhoni As Uncapped Player

MS Dhoni Retirement: ఎంఎస్ ధోనీ ఐపీఎల్ నుంచి రిటైర్మెంట్ (MS Dhoni Retirement) తీసుకుంటున్నాడా? మహీ ఐపీఎల్‌ నుంచి ఆటగాడిగా వైదొలగాలని నిర్ణయించుకున్నాడా? భారత క్రికెట్‌లో అత్యంత విజయవంతమైన కెప్టెన్‌లలో ఒకరిని మనం ఇకపై క్రికెట్ మైదానంలో చూడలేమా? ఈ ప్రశ్నలే ఇప్పుడు అభిమానులందరినీ భయపెడుతున్నాయి. ఎందుకంటే.. తాజాగా CSK తన సోషల్ మీడియా ఖాతాలో ధోనీ కోసం ఒక భావోద్వేగ వీడియోను పంచుకుంది. ఈ వీడియో తర్వాత ధోనీ రిటైర్మెంట్ గురించి ఊహాగానాలు తీవ్రమయ్యాయి.

CSK ఎమోషనల్ వీడియోను పోస్ట్ చేసింది..?

ఎంఎస్ ధోనీ తన కెప్టెన్సీలో ఐపిఎల్ 2023లో చెన్నై సూపర్ కింగ్స్‌ను ఐదోసారి టైటిల్‌ ను అందించాడు. దీని తర్వాత మహి తన రిటైర్మెంట్ ప్లాన్‌కు సంబంధించి ఎటువంటి స్పష్టమైన సమాధానం ఇవ్వలేదు. రిటైర్మెంట్ విషయాన్ని పరిశీలిస్తానని చెప్పాడు. అయితే తాజాగా CSK తన ట్విట్టర్ హ్యాండిల్‌లో ధోని కోసం ఒక భావోద్వేగ వీడియోను పంచుకుంది. ఇందులో మహి మెట్లు ఎక్కుతున్నట్లు కనిపించింది. ధోనీ బ్యాటింగ్, వికెట్ కీపింగ్ కూడా వీడియోలో కనిపించింది. CSK క్యాప్షన్‌లో “ఓ కెప్టెన్, మై కెప్టెన్” అని రాసి ఉంది.

Also Read: Moeen Ali: స్టోక్స్ మాత్రమే నన్ను రిటైర్మెంట్ నుంచి జట్టులోకి తీసుకురాగలిగాడు: మొయిన్ అలీ

రిటైర్మెంట్ గురించి మహి ఏమన్నాడు..?

చెన్నై సూపర్ కింగ్స్‌ను ఐదోసారి ఛాంపియన్‌గా నిలిపిన తర్వాత రిటైర్మెంట్ గురించి ఎంఎస్ ధోనీ స్పష్టమైన సమాధానం ఇవ్వలేదు. దీని కోసం తనకు ఇంకా చాలా సమయం ఉందని, అభిమానుల కోసం మరో సీజన్ ఆడాలనుకుంటున్నానని మహి చెప్పాడు. అయితే సీఎస్‌కే పోస్ట్ చేసిన వీడియో అభిమానులను తికమక పెడుతుంది. సోషల్ మీడియాలో రకరకాల రియాక్షన్స్ వస్తున్నాయి. ధోనీ తన నిర్ణయాలు ఎప్పుడూ హఠాత్తుగానే ప్రకటిస్తాడు. అంతర్జాతీయ క్రికెట్‌కు కూడా అకస్మాత్తుగా రిటైర్మెంట్ ప్రకటించాడు. ఈ నేపథ్యంలో చెన్నై సూపర్ కింగ్స్ రిలీజ్ చేసిన వీడియోతో ధోనీ ఐపీఎల్‌కు గుడ్‌బై చెప్పబోతున్నాడా అని మళ్లీ అనుమానాలు మొదలు అయ్యాయి. ఈ విషయంపై ధోనీ ప్రకటన కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు.