Site icon HashtagU Telugu

MS Dhoni: ప్రేక్షకులకు ధన్యవాదాలు: ధోని

MS Dhoni

Whatsapp Image 2023 04 24 At 7.52.53 Am

MS Dhoni: మహేంద్ర సింగ్ ధోనీ సారథ్యంలోని చెన్నై సూపర్ కింగ్స్ ఆదివారం కోల్‌కతా నైట్ రైడర్స్‌పై 49 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 235 పరుగులు చేసింది. భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన కోల్‌కతా 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 186 పరుగులు మాత్రమే చేయగలిగింది. అజింక్య రహానే (71 నాటౌట్), డెవాన్ కాన్వే (56), శివమ్ దూబే (50) భారీ పరుగులు రాబట్టి కోల్‌కతాపై చెన్నై 49 పరుగుల తేడాతో విజయం సాధించింది.

మ్యాచ్ గెలిచిన తర్వాత ధోని మాట్లాడుతూ.. ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపారు.వేలాది మంది ప్రేక్షకుల సపోర్ట్ చాలా ఎనర్జీని ఇస్తుంది. అందుకే ప్రతిఒక్కరికి ధన్యవాదాలు చెప్పాలి అనుకుంటున్నా అని అన్నారు మాహీ. ఇక రహానే ఆటతీరుపై ధోని ప్రశంసలు కురిపించారు. ఒకరి సామర్థ్యాన్ని గుర్తించి బ్యాటింగ్ చేసే విధంగా ప్రోత్సహించాలి. ఆ సమయంలో పూర్తిగా స్వేచ్ఛనివ్వాలి. అలాంటి వారికి జట్టులో ఉత్తమ స్థానం ఉంటుంది. రహానే సామర్థ్యం ఏంటో నాకు తెలుసు. అందుకే అతనికి మరింత మద్దతు ఇస్తే అద్భుతాలు చేయగలడు అంటూ రహానేపై ధోని ప్రశంసలు కురిపించారు.

ఇక ధోని చివరి ఐపీఎల్ ఈ సీజన్ అని తెలుస్తుంది. దేశానికి రెండు ప్రపంచ కప్ లు అందించిన ఘనత కేవలం ధోనీకే చెందుతుంది. కాగా ఈ సీజన్లో సీఎస్కె దుమ్ముదులుపుతుంది. ఒక సమయంలో తడబడినప్పటికీ ప్రస్తుతం వరుస విజయాలతో దూసుకుపోతుంది.

Read More: CSK vs KKR: కోల్‌కతా నైట్ రైడర్స్‌పై చెన్నై సూపర్ కింగ్స్ ఘన విజయం