Dhoni White Beard: తెల్ల గడ్డంతో తళుక్కుమన్న మాహీ..

ప్రపంచ క్రికెట్ చరిత్రలో ధోనీ అధ్యాయం చిరస్మరణీయం. టీమిండియాకు ఆయన చేసిన సేవ ఎప్పటికీ మరువలేనిది. దేశానికి మూడు ప్రపంచ కప్ లు అందించిన ఏకైక కెప్టెన్ ధోనీ

Published By: HashtagU Telugu Desk
Dhoni White Beard

New Web Story Copy (93)

Dhoni White Beard: ప్రపంచ క్రికెట్ చరిత్రలో ధోనీ అధ్యాయం చిరస్మరణీయం. టీమిండియాకు ఆయన చేసిన సేవ ఎప్పటికీ మరువలేనిది. దేశానికి మూడు ప్రపంచ కప్ లు అందించిన ఏకైక కెప్టెన్ ధోనీ. ఐపీఎల్ 2023లో టైటిల్ గెలుచుకుని చెన్నై ప్రాంచైజీకి ఐదు టైటిల్స్ అందించాడు. ప్రస్తుతం ధోనీ విశ్రాంతిలో ఉన్నాడు. ఖాళీ సమయంలో గారాలపట్టి జీవాతో ఎక్కువ సమయం గడుపుతున్నాడు. కాస్త సమయం దొరికితే తనకున్న ఫామ్ హౌస్ లో వ్యవసాయం చేస్తూ గడిపేస్తున్నాడు.

ధోనీకి ఉన్న అభిమానుల జాబితా వెలకట్టలేనిది. ప్రపంచ వ్యాప్తంగా ధోనీకి కోట్లలో ఫ్యాన్స్ ఉన్నారు. అయితే ధోనీకి కాస్త సమయం దొరికితే అభిమానుల్ని కలుస్తూ ఉంటాడు. ధోనీని కలవాలి అనేది సగటు అభిమాని కల. తాజాగా ధోనీని కొందరు పాత స్నేహితులు కలిశారు. ఆ ఫొటోలో ధోనీ తెలుపు గడ్డంలో రంగు రంగుల నైట్ సూట్‌లో దర్శనమిచ్చాడు. ఎంఎస్ ధోనీ పక్కన ముగ్గురు వ్యక్తులు నిలబడి ఉన్నారు. ఆ ఫొటోలో ధోనీ స్వాగ్ కనిపిస్తుంది. ప్రస్తుతం ఆ ఫొటోలో సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

ఐపీఎల్ 2023 ఫైనల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ గుజరాత్ టైటాన్స్‌ను 5 వికెట్ల తేడాతో ఓడించి ఐదోసారి ఐపీఎల్ టైటిల్‌ను గెలుచుకుంది. ఎంఎస్ ధోని సారథ్యంలోని చెన్నై సూపర్ కింగ్స్‌కు ఈ టైటిల్ చాలా ప్రత్యేకమైనది. ఎందుకంటే ధోనీకి ఇదే చివరి ఐపీఎల్ అన్న వార్తలు ప్రముఖంగా వినిపిస్తున్నాయి.

Read More: Puvvada Comments: సీఎం అయ్యేందుకు కేటీఆర్‌ సిద్ధంగా ఉన్నారు: మంత్రి పువ్వాడ

  Last Updated: 16 Jun 2023, 04:37 PM IST