Site icon HashtagU Telugu

Dhoni Autograph: ధోనీ ఆటోగ్రాఫ్ తీసుకున్న భారత క్రికెట్ లెజెండ్

Dhoni Autograph

Dhoni Autograph

Dhoni Autograph: మహేంద్ర సింగ్ ధోనీకి అభిమానుల ఫాలోయింగ్ ఎలా ఉంటుందో అందరికీ తెలుసు. సామాన్య అభిమాని నుంచి సెలబ్రిటీ వరకూ మిస్టర్ కూల్ ను ఇష్టపడని వారుండరు. ధోనీ గ్రౌండ్ లో ఉన్నాడంటే స్టేడియం హోరెత్తిపోవాల్సిందే. మహీతో ఫోటో కోసం, ఆటోగ్రాఫ్ కోసం ఎంతో మంది ఫాన్స్ ఎగబడుతుంటారు. సహచరుల్లో చాలా మంది యువ ఆటగాళ్ళు కూడా ధోనీ ఆటోగ్రాఫ్ తీసుకున్న సందర్భాలు ఉన్నాయి. అయితే భారత్ క్రికెట్ లో దిగ్గజం సునీల్ గవాస్కర్ ధోనీ ఆటోగ్రాఫ్ తీసుకున్న ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ మారాయి. ఈ అద్భుత దృశ్యం కోల్ కత్తా చెన్నై మ్యాచ్ ముగిసిన తర్వాత చోటు చేసుకుంది.

సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ సొంతమైదానంలో చివరి మ్యాచ్ ఆడేసింది. దీంతో మ్యాచ్ ముగిసిన తర్వాత కెమెరాలు అన్నీ ధోనీ చుట్టూనే తిరిగాయి. మైదానం చుట్టూ తిరుగుతూ అభిమానులకు కృతజ్ఞతలు తెలిపిన ధోనీ సేన.. ఫ్రాంచైజీ టీషర్ట్స్‌తో పాటు టెన్నిస్ రాకెట్స్, బాల్స్‌ను గ్యాలరీలోకి విసిరి ఫాన్స్ ను ఆనంద పరిచింది. ఈ సందర్భంగా
గవాస్కర్.. ధోనీని అడిగి మరీ ఆటోగ్రాఫ్ తీసుకోవడం అభిమానులను ఆకట్టుకుంది. గవాస్కర్ విజ్ఞప్తి మేరకు ధోనీ.. తన షర్ట్‌పై ఆటోగ్రాఫ్ ఇచ్చాడు. ఈ సన్నివేశానికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ కాగా.. అభిమానులు ఫిదా అవుతున్నారు.

ధోనీ రిటైర్మెంట్ (Dhoni Retirement ) అవుతాడనే ఉద్దేశంతోనే గవాస్కర్ ఈ ఆటోగ్రాఫ్ తీసుకున్నట్లు తెలుస్తోంది. గవాస్కరే కాకుండా చాలా మంది యువ ఆటగాళ్లు, సీనియర్ ఆటగాళ్లు ధోనీ ఆటోగ్రాఫ్‌లను తీసుకోవడంతో ఫొటోలకు ఫోజులిచ్చాడు. అయితే ధోనీ మరో సీజన్ ఆడుతాడని చెన్నై సూపర్ కింగ్స్ వర్గాలు పేర్కొన్నాయి. అతను రిటైర్మెంట్ తీసుకోవడం లేదని స్పష్టం చేశాయి. వాస్తవానికి సొంత అభిమానుల మధ్య వీడ్కోలు తీసుకోవాలనుకుంటున్నానని గతేడాది ధోనీ చెప్పాడు. చెన్నై వేదికగా చివరి మ్యాచ్ లో మిష్టర్ కూల్ కు ఘనంగా వీడ్కోలు పలుకుతారని ప్రచారం జరిగింది. అయితే అలాంటిదేమీ జరగకపోవడంతో ధోనీ మరో సీజన్ ఆడతాడని తేలిపోయింది.

Read More: CSK vs KKR: చెన్నై కొంపముంచిన ఆ ఇద్దరు