Dhoni CSK Retirement? : ధోనీ ఫేస్ బుక్ లైవ్ @ మధ్యాహ్నం 2 గంటలకు.. ఏం చెప్పబోతున్నాడు?

భారత క్రికెట్ టీమ్ మాజీ సారధి మహేంద్ర సింగ్ ధోనీ తన అభిమానులకు ఈరోజు మరో గుడ్‌న్యూస్ చెప్పబోతున్నాడు.

  • Written By:
  • Publish Date - September 25, 2022 / 10:40 AM IST

భారత క్రికెట్ టీమ్ మాజీ సారధి మహేంద్ర సింగ్ ధోనీ తన అభిమానులకు ఈరోజు మరో గుడ్‌న్యూస్ చెప్పబోతున్నాడు. మామూలుగా సోషల్ మీడియాకు దూరంగా ఉండే మహీ.. శనివారం రోజున ఫేస్‌బుక్ వేదికగా ఓ పోస్ట్ షేర్ చేశాడు.”ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు ఫేస్ బుక్‌ లైవ్ లోకి వస్తాను. అందులో మీకు ఒక గుడ్‌న్యూస్ చెప్పబోతున్నాను. మీ అందరినీ ఆ లైవ్ లో కలుస్తాను” అని అందులో ధోనీ వెల్లడించారు. దీనిపై సోషల్ మీడియాలో, క్రికెట్ అభిమానుల్లో హాట్ డిబేట్ జరుగుతోంది. అయితే ధోనీ క్రికెట్‌పై మాట్లాడ బోతున్నారా ? వ్యక్తిగత జీవితం గురించి చెబుతారా? అనే దానిపై ఉత్కంఠ నెలకొంది.

తాజా పరిణామాలివీ..

2019 వరల్డ్ కప్‌ తర్వాత అంతర్జాతీయ క్రికెట్‌కు ఎంఎస్ ధోనీ దూరంగా ఉంటూ వచ్చాడు. ఆ తర్వాత కొన్ని రోజులకు రిటైర్మెంట్ ప్రకటించాడు. ప్రస్తుతం ఎంఎస్ ధోనీ ఐపీఎల్‌లో మాత్రమే ఆడుతున్నాడు. చెన్నై జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. ఈఏడాది ఐపీఎల్‌ ప్రారంభానికి ముందు చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ బాధ్యతల నుంచి తప్పుకొని, వాటిని ఆల్‌రౌండర్ జడేజాకు అప్పగించాడు. ఐతే అతడి ఆధ్వర్యంలో చెన్నై వరుసగా ఓటమి పాలైంది.దీంతో తిరిగి చెన్నై జట్టు పగ్గాలను ఎంఎస్ ధోనీ తీసుకున్నాడు. ఆ తర్వాత ఒకటి రెండు మ్యాచ్‌ల్లో మాత్రమే ఆ జట్టు గెలిచింది. ఐనా నాకౌట్ దశకు చేరలేకపోయింది. వచ్చే ఏడాది జరగబోయే ఐపీఎల్‌లోనూ ఎంఎస్ ధోనీయే కెప్టెన్‌గా ఉంటాడని
చెన్నై జట్టు తెలిపింది. అయితే దీనికి అంగీకారం తెలుపుతూ ధోనీ నుంచి ఎలాంటి స్పందన రాలేదు. మొత్తంగా అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన ధోనీ..వ్యక్తిగత జీవితంలో బిజీగా ఉన్నాడు. ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు ధోనీ ఏం చెప్పబోతున్నాడన్న ఆసక్తి అందరిలో నెలకొంది.

గుడ్ బై చెబుతారా?

టీమిండియా మాజీ కెప్టెన్, చెన్నై సూపర్ కింగ్స్ సారథి మహేంద్ర సింగ్ ధోనీ అన్ని రకాల క్రికెట్‌కు గుడ్ బై చెప్పనున్నాడా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. రెండేళ్ల క్రితం అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన భారత దిగ్గజం.. అప్పటి నుంచి ఐపీఎల్‌ మాత్రమే ఆడుతున్నాడు. చెన్నై సూపర్ కింగ్స్ సారథిగా టైటిల్ అందించిన ధోనీ.. గత సీజన్‌లో బ్యా‌ట్‌తో రాణించి తనలో ఇంకా సత్తా ఉందని చాటిచెప్పాడు. అయితే అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికినప్పటి నుంచి ధోనీ త్వరలోనే ఐపీఎల్‌కు కూడా వీడ్కోలు పలుకుతాడని ప్రచారం జరుగుతోంది. గతేడాదే సీఎస్‌కేకు గుడ్ బై చెబుతాడని వార్తలు వచ్చాయి. కానీ సొంతమైదానంలో ఆడిన తర్వాతే ఆటకు అల్విదా ప్రకటిస్తానని ధోనీ ఈ వార్తలకు చెక్ పెట్టాడు.సౌతాఫ్రికా వేదికగా జరగనున్న టీ20 లీగ్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌కు చెందిన జోహన్నెస్ బర్గ్ జట్టు తరఫున మెంటార్‌గా ఉండేందుకే ధోనీ ఈ నిర్ణయం తీసుకుంటున్నాడా? అనే సందేహం కలుగుతోంది. ఇక విదేశీ లీగ్స్ ఆడేందుకే రైనా, రాబిన్ ఊతప్ప భారత్‌‌లోని అన్ని రకాల క్రికెట్‌కు గుడ్ బై చెప్పారు.ధోనీ ఫేస్ బుక్ పోస్ట్‌ను చూసి కొందరు అభిమానులు కలవరపాటుకు గురయ్యారు. ‘రైనా మొదలుపెట్టాడు. రాబిన్ ఊతప్ప కొనసాగించాడు. ఇప్పుడు ధోనీ లైవ్ అంటున్నాడు. మేం ఊహించేది అస్సలు జరగకూడదు’ అని హార్ట్ బ్రేక్ ఏమోజీతో ఓ అభిమాని ట్వీట్ చేశాడు.