Site icon HashtagU Telugu

MS Dhoni: రైతు అవతారం ఎత్తిన కెప్టెన్ కూల్.. ట్రాక్టర్‌ నడిపిన ధోనీ.. వీడియో వైరల్..!

ms dhoni driving

Resizeimagesize (1280 X 720) 11zon

చెన్నై సూపర్ కింగ్స్ (CSK) కెప్టెన్ ఎంఎస్ ధోనీ (MS Dhoni) 2 సంవత్సరాల తర్వాత Instagramలో ఒక వీడియోను పంచుకున్నారు. వీడియోలో ధోనీ తన ఫామ్ హౌస్ వద్ద ట్రాక్టర్ నడుపుతూ పొలం దున్నుతున్నాడు. చాలా సంవత్సరాల తర్వాత అభిమానులు కూడా తమ అభిమాన క్రికెటర్ వీడియోను చూసి సంతోషిస్తున్నారు. దీనికి నిమిషాల్లో లక్షల లైక్‌లు వచ్చాయి. టీమిండియా మాజీ కెప్టెన్ ఎం.ఎస్ ధోనీ రైతు అవతారమెత్తారు. ఆయన ట్రాక్టర్​తో దుక్కి దున్నుతున్న వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. కొత్తది నేర్చుకోవడం ఎప్పుడూ బానే ఉంటుందని, కానీ పని పూర్తయ్యేందుకే ఎక్కువ సమయం పట్టిందని ఆయన తెలిపారు. ఈ వీడియోను చైన్నై సూపర్​కింగ్స్ జట్టు ట్విట్టర్ ​లో పోస్ట్ చేసింది. చాలా రోజుల తర్వాత ధోనీ ఇన్​స్టాలో కనిపించారు.

టీమ్ ఇండియా మోస్ట్ సక్సెస్ ఫుల్ కెప్టెన్ ఎంఎస్ ధోనీ సోషల్ మీడియాలో చాలా తక్కువ యాక్టివ్‌గా ఉంటాడు. ధోనీ ఇల్లు లేదా ఫామ్‌హౌస్‌కి సంబంధించిన ఏదైనా వీడియో తెరపైకి వచ్చినప్పుడల్లా అది అతని భార్య ద్వారానే వస్తుంది. నిజానికి ఆమె సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. ఫిబ్రవరి 8కి ముందు ధోనీ ఇన్‌స్టాగ్రామ్‌లో 8 జనవరి 2021న చివరి పోస్ట్ చేశాడు. 2 సంవత్సరాల 1 నెల తర్వాత, ధోనీ ఇన్‌స్టాగ్రామ్‌లో మరో పోస్ట్‌ను పోస్ట్ చేశాడు.

Also Read: Spin Challenge: కంగారూలకు స్పిన్ ఛాలెంజ్

MS ధోనీ తన Instagram (MS Dhoni Instagram)లో ఈ వీడియోను ఫిబ్రవరి 8 (బుధవారం) నాడు పంచుకున్నాడు. ధోనీ ట్రాక్టర్‌తో పొలం దున్నుతున్నాడు. అతనితో పాటు మరొక వ్యక్తి ట్రాక్టర్‌పై కూర్చున్నాడు. ధోనీ ఈ వీడియోతో క్యాప్షన్‌లో ఇలా రాశాడు. కొత్తది నేర్చుకోవడం ఆనందంగా ఉంది. కానీ దాన్ని పూర్తి చేయడానికి చాలా సమయం పట్టింది అని రాసుకొచ్చాడు. MS ధోనీ ఐపీఎల్ లో మొదటి సీజన్ నుండి CSKతోనే ఉన్నాడు. 2 సీజన్లలో రైజింగ్ పూణే సూపర్ జెయింట్ తరపున ఆడాడు. గత ఏడాది ధోనీ స్వయంగా CSK కెప్టెన్సీని వదులుకున్నాడు. కానీ CSK కొత్త కెప్టెన్ జడేజా పేలవమైన ఫామ్ తర్వాత ధోనీ తిరిగి నాయకత్వ బాధ్యతలు తీసుకున్న విషయం తెలిసిందే.

2020 ఆగస్ట్ 15వ తేదీన మహేంద్ర సింగ్ ధోని అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. ధోని తన అంతర్జాతీయ కెరీర్‌లో మొత్తంగా 538 మ్యాచ్‌లు ఆడాడు, అందులో అతను 44.96 సగటుతో మొత్తం 21,834 పరుగులు చేశాడు. ఇందులో 16 సెంచరీలు, 108 హాఫ్ సెంచరీలు సాధించాడు. ఐపీఎల్‌లో మాత్రం ఇంకా ఆడుతున్నాడు. 2023లో జరిగే ఐపీఎల్‌లో మహేంద్ర సింగ్ ధోనీ మరోసారి రంగంలోకి దిగనున్నాడు.