MS Dhoni: హార్ట్ బ్రేక్ మూమెంట్ కు 4 ఏళ్ళు.. మరోసారి వైరల్ అవుతున్న ధోనీ రనౌట్ వీడియో..!

భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ (MS Dhoni) ప్రపంచ కప్ 2019 సెమీ ఫైనల్‌లో తన చివరి అంతర్జాతీయ మ్యాచ్ ఆడాడు. ఇదే మ్యాచ్‌లో ధోనీ రనౌట్ అయ్యాడు.

  • Written By:
  • Publish Date - July 10, 2023 / 02:28 PM IST

MS Dhoni: భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ (MS Dhoni) ప్రపంచ కప్ 2019 సెమీ ఫైనల్‌లో తన చివరి అంతర్జాతీయ మ్యాచ్ ఆడాడు. ఇదే మ్యాచ్‌లో ధోనీ రనౌట్ అయ్యాడు. అతని రనౌట్‌తో కోట్లాది మంది భారతీయ అభిమానులు గుండెలు బాదుకున్నారు. సెమీ-ఫైనల్‌లో టీమ్ ఇండియా గెలవడానికి 10 బంతుల్లో 25 పరుగులు చేయాల్సి ఉంది. క్రీజులో ధోనీ ఉన్నాడు.

అయితే ధోని రనౌట్ కోట్లాది అభిమానుల ఆశలపై నీళ్లు చల్లింది. 49వ ఓవర్ మూడో బంతి ధోనీ బొటన వేలికి తగిలి లెగ్ సైడ్ వైపు వెళ్లింది. బంతి దూరంగా వెళుతున్నట్లు చూసిన ధోనీ మొదటి పరుగు పూర్తి చేసి, రెండో పరుగు కోసం కూడా పరుగెత్తాడు. బంతి లెగ్ సైడ్‌లో ఫీల్డింగ్ చేస్తున్న మార్టిన్ గప్టిల్ వద్దకు వెళ్లి నేరుగా త్రో స్టంప్‌ను తాకింది.

Also Read: Ajinkya Rahane: జూలై 12 నుంచి విండీస్ తో తొలి టెస్టు.. వెస్టిండీస్‌లో రహానే రికార్డు ఎలా ఉందంటే..?

ధోనీ క్రీజ్‌లోకి చేరుకోలేకపోయాడు. ధోని రనౌట్ తర్వాత భారత అభిమానులందరి ఆశలు అడియాశలయ్యాయి. రనౌట్ తర్వాత ధోని 72 బంతుల్లో 1 ఫోర్, 1 సిక్స్ సాయంతో 50 పరుగులు చేసి పెవిలియన్‌కు చేరుకున్నాడు. ధోని రూపంలో టీమిండియా 8వ వికెట్ కోల్పోయింది. 240 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 18 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఈ మ్యాచ్ ధోనీ అంతర్జాతీయ కెరీర్‌లో చివరి మ్యాచ్‌గా నిలిచింది. దీని తరువాత, ఆగష్టు 15, 2020న అంతర్జాతీయ క్రికెట్ నుండి రిటైర్మెంట్ ప్రకటించాడు. ఇప్పుడు అతను ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ తరపున మాత్రమే ఆడుతున్నాడు.

2023 ప్రపంచకప్ భారత్‌లో జరగనుంది

2023 ODI ప్రపంచకప్ భారతదేశంలో జరగనుంది. టోర్నీ షెడ్యూల్ వచ్చేసింది. ప్రపంచకప్ అక్టోబర్ 5 నుంచి ప్రారంభం కాగా ఫైనల్ మ్యాచ్ నవంబర్ 19న జరగనుంది. టోర్నీలో మొత్తం 48 మ్యాచ్‌లు జరగనున్నాయి.