MS Dhoni With Donald Trump: భారత జట్టు మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్ అయి 3 ఏళ్లు దాటినా.. నేటికీ అతడిపై అభిమానుల క్రేజ్ తగ్గలేదు. ఇప్పుడు ఈ జాబితాలోకి అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (MS Dhoni With Donald Trump) పేరు చేరింది. ప్రస్తుతం ధోని తన కుటుంబంతో అమెరికాలో ఎంజాయ్ చేస్తున్నాడు. ఈ సమయంలో ధోనీ.. డొనాల్డ్ ట్రంప్‌తో ఉన్న ఫోటో బయటపడింది. విషయం ఏంటంటే.. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నుంచి గోల్ఫ్ గేమ్ ఆడేందుకు ధోనీ ఆహ్వానం అందుకున్నాడు. ధోనీ ట్రంప్‌తో కలిసి గోల్ఫ్ ఆడుతున్న వీడియోలు సోషల్ మీడియాలో కనిపించాయి. అవి కాస్త వైరల్‌గా మారాయి.
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ధోనీ కోసం గోల్ఫ్ గేమ్‌ను నిర్వహించారు. అంతర్జాతీయ క్రికెట్ నుండి రిటైర్ అయిన తర్వాత ధోనీ గోల్ఫ్ ఆడుతూ చాలా ఆనందిస్తున్నాడు. అంతకుముందు US ఓపెన్ 2023లో కార్లోస్ అల్కరాజ్, జ్వెరెవ్‌ల మధ్య జరిగిన క్వార్టర్-ఫైనల్ మ్యాచ్‌ని చూడటానికి ధోని వచ్చినప్పుడు కూడా అమెరికాలో ధోని వీడియో బయటపడింది.
Also Read: Vibrio Vulnificus : అమెరికా ప్రజలను వణికిస్తున్న విబ్రియో వల్నిఫికస్ బ్యాక్టీరియా
MS Dhoni playing golf with Donald Trump.
– The craze for Dhoni is huge. pic.twitter.com/fyxCo3lhAQ
— Johns. (@CricCrazyJohns) September 8, 2023
ఇంతకు ముందు కూడా ధోని గోల్ఫ్ ఆడుతున్న వీడియోలు చాలాసార్లు బయటపడ్డాయి. ఐపీఎల్ 16వ సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ విజేతగా నిలిచిన తర్వాత ధోనీ మోకాలికి ఆపరేషన్ చేశారు. దీని తరువాత కొన్ని నెలలు పునరావాసంలో గడిపిన ధోనీ ఇప్పుడు పూర్తిగా ఫిట్‌గా ఉన్నాడు.
గత ఐసీసీ ట్రోఫీని ధోనీ సారథ్యంలో భారత జట్టు గెలుచుకుంది
ప్రపంచ క్రికెట్‌లో కెప్టెన్‌గా గొప్ప ఆటగాళ్లలో ధోనీ పేరు ఉంది. ఐసిసి ఈవెంట్లలో కెప్టెన్‌గా అతని అద్భుతమైన ప్రదర్శన దీనికి అతిపెద్ద కారణం. 2013లో ధోనీ నాయకత్వంలో భారత జట్టు తన చివరి ఐసీసీ ట్రోఫీని గెలుచుకుంది. 2011లో టీమిండియా సొంతగడ్డపై వన్డే ప్రపంచకప్ ఆడి టైటిల్ గెలిచినప్పుడు ఆ సమయంలో కూడా ధోనీ కెప్టెన్‌గా ఉన్నాడు.