Site icon HashtagU Telugu

MS Dhoni Photo: కెప్టెన్ కూల్ క్రేజ్ మాములుగా లేదుగా.. పెళ్లి కార్డుపై ధోనీ ఫొటో..!

MS Dhoni Photo

Resizeimagesize (1280 X 720) (1)

MS Dhoni Photo: సోషల్ మీడియాలో ఓ వెడ్డింగ్ కార్డ్ వైరల్ అవుతోంది. ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌గఢ్ జిల్లాకు చెందిన వెడ్డింగ్ కార్డ్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నిజానికి ఈ వెడ్డింగ్ కార్డ్‌కి రెండు వైపులా భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ చిత్రాలు (MS Dhoni Photo) ఉన్నాయి. ఇది కాకుండా చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ కూల్ జెర్సీ నంబర్ 7 కూడా ముద్రించబడింది. అయితే మహేంద్ర సింగ్ ధోని ఈ అభిమాని గురించి మీకు తెలుసా? ఈ కెప్టెన్ కూల్ అభిమాని పేరు దీపక్ పటేల్. ఇతను మిలుపారా జిల్లా కొండ్‌కెల్‌ నివాసి. భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి దీపక్ పటేల్ వీరాభిమాని.

చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ధోనీపై దీపక్ పటేల్ తన అభిమానాన్ని చాటుకున్నాడు. తన మ్యారేజ్‌ సందర్భంగా పెళ్లికార్డుకు ఇరువైపులా ధోనీ ఫొటోతో పాటు తలా అని ముద్రించాడు. అంతేకాదు జూన్‌ 7న తన పెళ్లికి రావాలని ధోనీకి పెళ్లికార్హు పంపించాడట. దీనికి సంబంధించిన ఫొటో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

Also Read: Ben Stokes: టెస్టు క్రికెట్ చరిత్రలో అరుదైన రికార్డు సొంతం చేసుకున్న బెన్ స్టోక్స్..!

చిన్నప్పటి నుంచి మహేంద్ర సింగ్ ధోనీని ఆదర్శంగా భావించేవాడినని, అందుకే క్రికెట్‌పై చాలా ఆసక్తి ఉందని దీపక్ పటేల్ చెప్పాడు. మహేంద్ర సింగ్ ధోనీ వల్లే తనకు చిన్నతనంలో క్రికెట్ అంటే ఇష్టమని, ఇప్పటి వరకు ఆ ప్రేమ అలాగే ఉండిపోయిందని చెప్పాడు. అలాగే తన గ్రామ క్రికెట్ జట్టుకు తాను కెప్టెన్ అని చెప్పాడు. అతను మహేంద్ర సింగ్ ధోని నుండి కెప్టెన్సీ మార్గాలను నేర్చుకున్నాడు. కేవలం పాపులారిటీ కారణంగా తాను ఇలా చేయలేదని, కెప్టెన్ కూల్ అంటే తనకు చాలా ఇష్టమని దీపక్ పటేల్ అన్నారు.

ఇక ఇటీవల జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ చివరి బంతికి గుజరాత్ టైటాన్స్‌ను ఓడించింది. చివరి మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ 15 ఓవర్లలో 171 పరుగుల విజయలక్ష్యాన్ని అందుకుంది. చివరి బంతికి మహేంద్ర సింగ్ ధోనీ సారథ్యంలోని చెన్నై సూపర్ కింగ్స్ విజయం సాధించింది. ఈ విధంగా చెన్నై సూపర్ కింగ్స్ ఐదోసారి ఐపీఎల్ టైటిల్ గెలుచుకుంది. అదే సమయంలో హార్దిక్ పాండ్యా నేతృత్వంలోని గుజరాత్ టైటాన్స్ వరుసగా రెండోసారి చాంపియన్‌గా నిలిచే అవకాశాన్ని కోల్పోయింది.

Exit mobile version