MS Dhoni: ధోనీ ఫెవ‌రేట్ క్రికెట‌ర్ ఎవరో తెలిసిపోయింది.. ఎవ‌రంటే..?

ఎంఎస్ ధోనీ ఈ పేరుకు క్రికెట్ అభిమానుల‌కు పెద్దగా పరిచయం అక్కర్లేదు. ధోనీ తన అద్భుత కెప్టెన్సీతో టీ20 ప్రపంచకప్‌, వన్డే ప్రపంచకప్‌, ఛాంపియన్స్ ట్రోఫీలను భారత్‌కు అందించాడు.

  • Written By:
  • Publish Date - October 15, 2022 / 07:15 AM IST

ఎంఎస్ ధోనీ ఈ పేరుకు క్రికెట్ అభిమానుల‌కు పెద్దగా పరిచయం అక్కర్లేదు. ధోనీ తన అద్భుత కెప్టెన్సీతో టీ20 ప్రపంచకప్‌, వన్డే ప్రపంచకప్‌, ఛాంపియన్స్ ట్రోఫీలను భారత్‌కు అందించాడు. క్రికెట్ చరిత్రలో మూడు ఐసీసీ ట్రోఫీలు సాధించిన ఏకైక కెప్టెన్ ధోనీనే కావ‌డం విశేషం. అయితే ధోనీ క్రికెట్‌లో త‌న ఆరాధ్య దైవం ఎవ‌రో చెప్పేశాడు.

సచిన్ టెండూల్కర్ లాగా బ్యాటింగ్ చేయాలనుకున్నానని, మాస్టర్ బ్లాస్టర్ తన క్రికెట్ ఆరాధ్యదైవం అని భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ తెలిపాడు. తాను చిన్ననాటి నుంచే సచిన్‌ను ఎంతో అభిమానించే వాడినని మాజీ క్రికెటర్ ధోని వెల్లడించారు. చెన్నైలో జరిగిన ఓ కార్యక్రమంలో విద్యార్థులతో ముచ్చటించారు.‘‘నేనూ మీలాగే పెరిగాను. చిన్నతనంలో సచిన్‌లా ఆడాలని కలలు కనేవాడిని. ఆయనలా ఆడలేనని కొంత కాలానికే అర్థమైంది. కానీ ఎప్పటికైనా ఆయనలా క్రికెట్ ఆడాలనే బలమైన కోరిక ఉండేది. అతడే నా రోల్‌మోడల్‌’’ అని చెన్నై సూపర్ కింగ్స్ వారి ట్విట్టర్ హ్యాండిల్‌లో పోస్ట్ చేసిన వీడియోలో పేర్కొన్నాడు.

స్కూల్‌లో తనకు ఇష్టమైన సబ్జెక్ట్ గురించి అడిగినప్పుడ, ధోని సమాధానం ఈవెంట్‌లో ఉన్న‌వారిని నవ్వుల్లో ముంచెత్తింది. “స్పోర్ట్స్ సబ్జెక్ట్‌ అర్హత సాధిస్తుందా?” అని నవ్వుతూ సమాధానం చెప్పాడు. పాఠశాల సమయంలో తనకు అన్ని సబ్జెక్టులకన్నా స్పోర్ట్స్‌ పీరియడ్‌ అంటేనే ఇష్టమని పేర్కొన్నాడు. చిన్ననాటి నుంచే సచిన్‌ను ఎంతో అభిమానించేవాడినని చెప్పాడు.

అంతర్జాతీయ క్రికెట్ నుండి రిటైర్ అయిన ధోని ఇప్పటికీ ఐపీఎల్‌ ఫ్రాంచైజీ CSKకి నాయకత్వం వహిస్తున్నాడు. ధోనీ IPL 2023లో కూడా ఆడతాడని తెలిపాడు. ఐపీఎల్ 2022లో తొలుత‌ జడేజా సీఎస్‌కే జ‌ట్టుకు నాయ‌క‌త్వం వ‌హించాడు. త‌ర్వాత జ‌డేజా నాయ‌క‌త్వం నుంచి వైదొలిగిన తర్వాత ధోనీ మళ్లీ CSK కెప్టెన్‌గా వ్య‌వ‌హ‌రించిన విష‌యం తెలిసిందే.