MS Dhoni: భారత మాజీ కెప్టెన్, చెన్నై సూపర్ కింగ్స్ (CSK) దిగ్గజ ఆటగాడు ఎంఎస్ ధోనీ (MS Dhoni) తన ఐపీఎల్ భవిష్యత్తుపై మరోసారి అభిమానుల ఉత్కంఠను పెంచాడు. 2020లో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన తర్వాత ధోనీ ఐపీఎల్‌లో మాత్రమే ఆడుతున్నాడు. అయితే 2025 సీజన్‌లో CSK పాయింట్ల పట్టికలో అత్యంత నిరాశాజనకంగా నిలవడంతో ఐపీఎల్ 2026లో ధోనీ ఆడతాడా? అనే ప్రశ్న ఇప్పుడు అందరి మనసుల్లో మెదులుతోంది.
ధోనీ ఇచ్చిన సమాధానం
ఇటీవల చెన్నైలో జరిగిన ఒక కార్యక్రమంలో ఎంఎస్ ధోనీ తన భవిష్యత్తుపై మాట్లాడుతూ.. అభిమానుల్లో ఆశలు నింపే విధంగానే సమాధానం ఇచ్చాడు. “నేను ఇంకా 15-20 సంవత్సరాలు ఆడతానని ప్రజలు ఆశించకూడదు. ఇది కేవలం ఒకటి లేదా రెండు సంవత్సరాల విషయం కాదు, మీరు నన్ను ఎల్లప్పుడూ పసుపు జెర్సీ (CSK)లోనే చూస్తారు” అని అన్నాడు. అయితే, “నేను ఇకపై ఆడతానా లేదా అనేది మీరు స్వయంగా తెలుసుకోవాలి” అని చెప్పి, తన భవిష్యత్తుపై సస్పెన్స్ కొనసాగించాడు.
Also Read: Green Energy Corridor: గ్రీన్ ఎనర్జీ కారిడార్‌కు అనుమతివ్వండి.. కేంద్ర మంత్రిని కోరిన డిప్యూటీ సీఎం!
గత రెండు-మూడు సీజన్ల నుంచి ధోనీ రిటైర్మెంట్ గురించి ఊహాగానాలు కొనసాగుతూనే ఉన్నాయి. అయితే ఈసారి, సీజన్ ముగిసిన కొన్ని నెలల తర్వాతే ఈ ప్రశ్న మళ్లీ తెరపైకి రావడం CSK అభిమానులలో ఆందోళన కలిగించింది. గతంలో, జాతీయ జట్టుకు ఆడటం తర్వాత తనకు ఇష్టమైన రెండవ విషయం ఐపీఎల్‌లో ఆడటమేనని ధోనీ చెప్పాడు.
గణాంకాలు ఏం చెబుతున్నాయి?
గత కొన్నేళ్లుగా ధోనీ బ్యాటింగ్‌లో పెద్దగా ప్రభావం చూపలేకపోతున్నాడు. అతను ఐపీఎల్‌లో చివరిసారిగా 2022 సీజన్‌లో KKRతో ఆడిన మ్యాచ్‌లో 50 పరుగుల మార్క్‌ను దాటాడు. ఆ తర్వాత 48 ఇన్నింగ్స్‌లలో బ్యాటింగ్ చేసినప్పటికీ అతని బ్యాట్ నుండి ఒక్క అర్ధ సెంచరీ కూడా రాలేదు. గత ఐదు సీజన్లలో ధోనీ మొత్తం కలిపి కేవలం 807 పరుగులు మాత్రమే చేయగలిగాడు.