MS Dhoni: అందుకే ధోనీ చివరిలో బ్యాటింగ్ కు వస్తున్నాడు

ఈ సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ మాజీ కెప్టెన్ ధోని చివరి స్థానంలో బ్యాటింగ్ కొస్తున్నాడు. పంజాబ్ కింగ్స్‌తో జరిగిన చివరి మ్యాచ్‌లో, ధోని 9వ నంబర్‌లో బ్యాటింగ్‌కు వచ్చాడు. 17 ఏళ్ల ఐపీఎల్ కెరీర్‌లో ధోనీ 9వ స్థానంలో బ్యాటింగ్ కు రావడం ఇదే తొలిసారి. ఈ మ్యాచ్ తర్వాత ధోనీపై విమర్శలు వచ్చాయి.

MS Dhoni: ఈ సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ మాజీ కెప్టెన్ ధోని చివరి స్థానంలో బ్యాటింగ్ కొస్తున్నాడు. పంజాబ్ కింగ్స్‌తో జరిగిన చివరి మ్యాచ్‌లో, ధోని 9వ నంబర్‌లో బ్యాటింగ్‌కు వచ్చాడు. 17 ఏళ్ల ఐపీఎల్ కెరీర్‌లో ధోనీ 9వ స్థానంలో బ్యాటింగ్ కు రావడం ఇదే తొలిసారి. ఈ మ్యాచ్ తర్వాత ధోనీపై విమర్శలు వచ్చాయి. ఇక ఈ మ్యాచ్ లో మాహీ డకౌట్ కావడంతో ట్రోలర్స్ ధోనీని టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు.

హర్భజన్ సింగ్, ఇర్ఫాన్ పఠాన్ వంటి భారత మాజీ ఆటగాళ్లు కూడా ధోనీపై ఆగ్రహం వ్యక్తం చేశారు, అయితే ఇప్పుడు అసలు నిజం బయటపడింది. ఈ వార్త వింటే సగటు క్రికెట్ ఫ్యాన్స్ గుండె తరుక్కుపోతుంది. గత మ్యాచ్ లో ధోనీ తొందరగా బ్యాటింగ్‌కి వస్తాడని అందరూ అనుకున్నారు. కానీ అది జరగలేదు. ధోనీ 9వ నంబర్‌లో బ్యాటింగ్‌కి వచ్చాడు. చివరి ఓవర్లో ధోని ఆడడం వ్యూహంలో భాగం కాదు, అది బలవంతం అని తెలిసాక విమర్శకులు సైతం కన్నీళ్లు పెట్టుకున్నారు . టైమ్స్ ఆఫ్ ఇండియాలో వచ్చిన కథనం ప్రకారం ధోనీ ఇంకా క్యూర్ అవ్వలేదు.

గతేడాది ఐపీఎల్ లో కూడా గాయంతోనే ఆడాడు. అయితే ఈ ఏడాది రెస్ట్ తీసుకోవాలని డాక్టర్లు సూచించినప్పటికీ ధోనీ కేవలం ఫ్యాన్స్ కోసమే గాయాన్ని లెక్కచేయకుండా ఐపీఎల్ ఆడుతున్నాడు. అయితే గాయం మాత్రం అలానే ఉంది. కండరాల సమస్యతో బాధ పడుతూనే ధోనీ కీపింగ్ చేస్తున్నాడు. నిజానికి సిఎస్కె మరో వికెట్ కీపర్ డెవాన్ కాన్వే గాయం కారణంగా ఇప్పటికే టోర్నీకి దూరంగా ఉన్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో జట్టుకు ధోనీ అవసరం చాలానే ఉంది. అందుకే ధోనీ తన బాధను పట్టించుకోకుండా పెయిన్ కిల్లర్ టాబ్లెట్స్ తీసుకుంటూ జట్టు కోసం నిరంతరం శ్రమిస్తున్నాడు. అందుకే ధోనీ బ్యాటింగ్ అర్దర్లో మార్పులు జరిగాయి. త్వరగా వచ్చి ఇబ్బంది పడి టోర్నీకి దూరం కావడం కంటే చివరిలో వచ్చి ఫ్యాన్స్ కోసం రెండు, మూడు బంతులు ఆడినా చాలని కొందరు భావిస్తున్నారు. మరి మీరేమంటారో కామెంట్ చేయండి.

Also Read: Brazil Floods: బ్రెజిల్‌లో వరదలు బీభత్సం .. భారీగా మరణాలు