Site icon HashtagU Telugu

Captain Cool: ‘కెప్టెన్ కూల్’ పేరుకి ట్రేడ్ మార్క్ రైట్స్ తీసుకున్న ధోనీ!

Captain Cool

Captain Cool

Captain Cool: భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని పుట్టినరోజు సమీపిస్తోంది. జూలై 7న ధోని 44 ఏళ్లు పూర్తి చేసుకోనున్నారు. అంతకు ముందే అతను తనకు తాను పుట్టినరోజు బహుమతిని ఇచ్చుకోవాలని నిశ్చయించుకున్నట్లు కనిపిస్తోంది. నిజానికి అతను ‘కెప్టెన్ కూల్’ (Captain Cool) అనే ప‌దం కోసం ట్రేడ్‌మార్క్ దాఖలు చేశాడు. ఒత్తిడితో కూడిన పరిస్థితుల్లో కూడా ఓపికతో నిర్ణయాలు తీసుకోవడం కోసం ధోనిని ‘కెప్టెన్ కూల్’ అని పిలుస్తారు. వార్తల ప్రకారం.. ధోని జూన్ 5నే ట్రేడ్‌మార్క్ కోసం దరఖాస్తు చేశాడు. ట్రేడ్‌మార్క్స్ రిజిస్ట్రీ పోర్టల్ ప్రకారం.. ఎంఎస్ ధోని దరఖాస్తు స్థితి ‘ఆమోదించబడిన, ప్రకటన చేయబడిన’ స్థితిలో ఉంది.

ఈ ట్రేడ్‌మార్క్ క్రీడల శిక్షణ, క్రీడల కోచింగ్ సేవలను అందించే విభాగం కింద నమోదు చేసిన‌ట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు ధోని ఈ విషయంపై ఎలాంటి ప్రకటన విడుదల చేయలేదు. నివేదికల ప్రకారం.. ‘కెప్టెన్ కూల్స ప‌దం కోసం గతంలో ప్రభా స్కిల్ స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ కూడా దరఖాస్తు చేసింది. కానీ ఆ దరఖాస్తు స్థితి సవరణలో ఉన్నట్లు చూపిస్తోంది.

Also Read: Sangareddy Chemical Plant Explosion : సిగాచి వైస్‌ ప్రెసిడెంట్‌ ఎల్‌ఎన్‌ గోవన్‌ మృతి

ఎంఎస్ ధోనిని ఇటీవల ICC హాల్ ఆఫ్ ఫేమ్‌తో సన్మానించారు. ధోని దీనిని ఒక గొప్ప విజయంగా అభివర్ణించాడు. ఎంఎస్ ధోని టెస్ట్ క్రికెట్‌లో కెప్టెన్‌గా పెద్దగా విజయం సాధించలేకపోయాడు. కానీ వైట్ బాల్ క్రికెట్‌లో అతను అనేక విజయాలు సాధించాడు. అతని కెప్టెన్సీలో భారత జట్టు 2011 ODI వరల్డ్ కప్‌ను గెలుచుకుంది. ఒకసారి T20 వరల్డ్ కప్ టైటిల్‌ను కూడా గెలుచుకుంది. 2013 చాంపియన్స్ ట్రోఫీని గెలిచిన జట్టును కూడా ధోనినే నాయ‌క‌త్వం వ‌హించాడు. ఎంఎస్ ధోని ఆగస్టు 2020లో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. అతను తన 350 ODI మ్యాచ్‌ల కెరీర్‌లో 10,773 పరుగులు చేశాడు. అలాగే 90 టెస్ట్ మ్యాచ్‌లలో 4,876 పరుగులు సాధించాడు. తన 98 T20 మ్యాచ్‌ల కెరీర్‌లో అతను 1,617 పరుగులు చేశాడు.