MS Dhoni Fan Suicide: ధోని వీరాభిమాని గోపికృష్ణ ఆత్మ‌హ‌త్య

మహేంద్ర సింగ్ ధోని వీరాభిమాని గోపికృష్ణ ఆత్మహత్య చేసుకున్నాడు. ధోని డైహార్డ్ ఫ్యాన్ గా గుర్తింపు పొందిన గోపికృష్ణ మరణం పలు అనుమానాలకు దారి తీస్తుంది. తమిళనాడులోని కడలూర్ జిల్లా అరంగూర్ కు చెందిన గోపికృష్ణన్

MS Dhoni Fan Suicide: మహేంద్ర సింగ్ ధోని వీరాభిమాని గోపికృష్ణ ఆత్మహత్య చేసుకున్నాడు. ధోని డైహార్డ్ ఫ్యాన్ గా గుర్తింపు పొందిన గోపికృష్ణ మరణం పలు అనుమానాలకు దారి తీస్తుంది. తమిళనాడులోని కడలూర్ జిల్లా అరంగూర్ కు చెందిన గోపికృష్ణన్ చెన్నై సూపర్ కింగ్స్ ను తలపించేలా తన ఇంటిని మార్చేసి బాగా ఫెమస్ అయ్యాడు.

గోపికృష్ణ ఆర్ధిక సమస్యలతో అతను ఆత్మహత్య చేసుకున్నట్లు విచారణలో తేలింది. 34 ఏళ్ళ గోపికృష్ణ దుబాయ్‌లో ఉద్యోగం చేసేవాడు. 2020లో తన స్వగ్రామానికి తిరిగి వచ్చి ధోనిపై ఉన్న అభిమానంతో చెన్నై సూపర్ కింగ్స్ యెల్లో పెయింట్, ధోనీ ఫొటోలతో ఇంటిని అలకరించుకున్నాడు. గోడల నిండా ధోనీ బొమ్మలను వేయించాడు. దీంతో గోపీ ఇల్లు సోషల్ మీడియాలో వైరల్ అయింది. చివరకు చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ధోనీ వరకు ఈ ఫొటోలు, వీడియోలు చేరాయి. ధోనీ కూడా స్పందించాడు. తన అభిమాని ప్రేమను చూసి ఎమోషనలయ్యాడు. దాంతో గోపికృష్ణ పేరు బాగా పాపులర్ అయింది. అలా అతను మహేంద్ర సింగ్ ధోనీ డైహార్డ్ అభిమానిగా గుర్తింపు పొందాడు.

గోపికృష్ణకు కిషోర్, శక్తివేల్‌ ఇద్దరు కుమారులున్నారు. బాధాకరమైన విషయం ఏంటంటే10 రోజుల క్రితమే పాప పుట్టింది. అయితే ఆర్ధిక సమస్యలతో మనస్తాపానికి గురైన అతను ఎంతో కోరికతో డిజైన్ చేసిన ఇంట్లోనే ఉరివేసుకున్నాడు. ధోనీ వీరాభిమాని ఆత్మహత్యతో స్థానికుల్లో విషాదం నెలకొంది. అటు చెన్నై ఫాన్స్ గోపికృష్ణకు సంతాపం తెలుపుతున్నారు. వీరాభిమాని మరణం వార్త ధోనీకి వరకు తీసుకెళ్లాలని ఫాన్స్ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఇక గోపికృష్ణ సూసైడ్ పై దర్యాప్తు చేపట్టగా తన ఊరిలో కొంతమందితో గోపి కృష్ణకు ఆర్థిక వివాదాలున్నట్లు తేలింది. ఈ విషయంలో గొడవ జరగడంతో మనస్థాపానికి గురైన అతను ఆత్మహత్య చేసుకున్నట్లు తేలింది.

Also Read: Rs 10000 Crore : జమిలి ఎన్నికల ఖర్చు.. ప్రతి 15 ఏళ్లకు రూ.10వేల కోట్లు : ఈసీ