Site icon HashtagU Telugu

Dhoni Fast Stumping: కాంతి కంటే వేగంగా.. ధోనీ స్టంపింగా.. మజాకా..!

Dhoni Fast Stumping

Resizeimagesize (1280 X 720)

Dhoni Fast Stumping: సింహం ముందు ఎప్పుడూ కుప్పి గంతులు వేయకూడదు.. అలాగే వికెట్ల వెనుక ధోనీ (Dhoni Fast Stumping) ఉన్నప్పుడు క్రేజు దాటితే ఇక పెవిలియన్ కు వెళ్లాల్సిందే. ఐపీఎల్ ఫైనల్లో ఇదే జరిగింది. క్రికెట్ లోనే కాదు ఎక్కడయినా రెప్పపాటు కాలం కూడా చాలా విలువైంది. ఈ సంగతి గుజరాత్ ఓపెనర్ గిల్ కు బాగా తెలిసొచ్చింది. వికెట్ల వెనుక వరల్డ్ బెస్ట్ కీపర్ ను ఉంచుకుని క్రీజులో కాలు ముందుకు కదిపిన గిల్ భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది.

ఓవైపు సాహా, శుభ్‌మన్ గిల్ ధాటిగా ఆడుతుండటంతో గుజరాత్ పవర్ ప్లేలోనే వికెట్ నష్టపోకుండా 62 పరుగులు చేసింది. ఈ పరిస్థితుల్లో జడేజాను రంగంలోకి దింపిన ధోనీ.. సూపర్ స్టంపింగ్‌తో గిల్‌ను ఔట్ చేసి తన జట్టుకు బ్రేక్ త్రూ ఇచ్చాడు. ఏడో ఓవర్ చివరి బంతిని జడేజా.. ఫ్లాట్ లెంగ్త్‌గా వేయగా.. గిల్ మూందుకు స్ట్రెచ్ అయ్యి డ్రైవ్ ఆడే ప్రయత్నం చేశాడు. కానీ బ్యాట్‌ను మిస్సైన బంతి కీపర్ ధోనీ చేతిలో పడగా.. అతను వెంటనే వికెట్లను కొట్టేసాడు. అప్పటికే గిల్ క్రీజును ధాటడంతో స్టంపౌటయ్యాడు. కేవలం రెప్పపాటు వ్యవధిలో ఇది జరిగింది. ధోనీ కేవలం 0.1 సెకెండ్ లో ఈ స్టంపింగ్ చేయడం అతని కీపింగ్ స్టామినాను మరోసారి అందరికీ తెలియజెప్పింది.

Also Read: World Test Championship: ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్ కు అంపైర్స్‌ వీళ్లే .. ఆయన కూడా ఉన్నాడుగా..!

ధోనీ స్టంపౌట్‌పై అభిమానులు, మాజీ క్రికెటర్లు, విశ్లేషకులు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ధోనీ చేసిన స్టంపౌట్లలో ఇప్పటి వరకు తాను చూసిన అత్యుత్తమైనది ఇదేనని సంజయ్ మంజ్రేకర్ ట్వీట్ చేయగా.. 4జీ, 5జీ కంటే ధోనీ వేగమే ఎక్కవని ఆకాశ్ చోప్రా కొనియాడాడు. ప్రస్తుతం ధోనీ స్టంపౌట్‌కు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. స్టన్నింగ్ స్టంపౌట్ అని హర్షా భోగ్లే మెచ్చుకున్నాడు. కాగా కాంతి కంటే వేగంగా ధోనీ స్టంపింగ్ ఉందంటూ ఫాన్స్ ట్వీట్ చేస్తున్నారు. మ్యాచ్ జరుగుతున్నప్పుడు ఈ స్టంపింగ్ ట్విట్టర్ లో ట్రెండింగ్ గా నిలిచింది.