Decoding Dhoni: కెప్టెన్లకే కెప్టెన్ లాంటోడు.. సారథిగా ధోనీ రికార్డులు ఇవే

జెంటిల్మెన్ గేమ్ క్రికెట్ లో అద్భుతమైన ఆటగాళ్ళు ఉంటే సరిపోదు.. వారిని నడిపించే సమర్ధుడైన నాయకుడు ఉండాలి... ముఖ్యంగా టీ ట్వంటీ ఫార్మాట్ లో అత్యంత వేగంగా నిర్ణయాలు తీసుకోవాలి. ఎంత ఒత్తిడి ఉన్నా తట్టుకుంటూ జట్టును లీడ్ చేయాలి.

Decoding Dhoni: జెంటిల్మెన్ గేమ్ క్రికెట్ లో అద్భుతమైన ఆటగాళ్ళు ఉంటే సరిపోదు.. వారిని నడిపించే సమర్ధుడైన నాయకుడు ఉండాలి… ముఖ్యంగా టీ ట్వంటీ ఫార్మాట్ లో అత్యంత వేగంగా నిర్ణయాలు తీసుకోవాలి. ఎంత ఒత్తిడి ఉన్నా తట్టుకుంటూ జట్టును లీడ్ చేయాలి. ఆటగాళ్ళు తప్పు చేస్తే దానిని చెబుతూ వారిని ప్రోత్సహించాలి. మైదానంలో దిగిన తర్వాత వ్యూహాలు అప్పటికప్పుడు మార్చుకోవాల్సిన పరిస్థితులూ ఎదురవుతాయి. ఇలాంటి వాటికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఎవరైనా ఉన్నారంటే అది మహేంద్రసింగ్ ధోనీ… నిజమే ధోనీ కెప్టెన్సీ గురించి ప్రత్యేకంగా చెప్పుకునే పనిలేదు. కెప్టెన్లకే కెప్టెన్ లాంటోడు.. అంతర్జాతీయ క్రికెట్ లో ఎన్నోసార్లు ఇది రుజువైంది. రిటైర్మెంట్ తర్వాత ఐపీఎల్ లో కొనసాగుతూ అభిమానులను అలరిస్తున్నాడు. ఒక్కో సీజన్ లో జట్టు విఫలమైనా ఓటమికి సాకులు చెప్పకుండా అంతా తనమీద వేసుకున్న సందర్భాలు ఉన్నాయి.

ఇక ధోనీ కూల్ కెప్టెన్సీ గురించి వరల్డ్ వైడ్ గా ఉన్న క్రికెట్ ఫ్యాన్స్ కు తెలిసిందే.. ఎంత ఒత్తిడిలో ఉన్నా జట్టును ఉత్సాహంగా ముందుకు నడిపించడంలో అతను దిట్ట. ప్రత్యర్థి బ్యాటర్లు చెలరేగిపోతున్న వేళలోనూ బౌలర్లపై విసుగును ప్రదర్శించకుండా వారికి సలహాలు ఇచ్చి ఫలితాలు రాబట్టడంలో ధోనిని మించినవాడు లేడనే చెప్పాలి. వికెట్ల వెనుక మెరుపు వేగంతో కీపింగ్ చేయడంలోనూ, బ్యాటర్లను ఎలా బోల్తా కొట్టించాలో స్పిన్నర్లకు పాఠాలు చెప్పడంలోనూ ధోనీ మాస్టర్ మైండ్ కు ఎవరైనా సలాం కొట్టాల్సిందే. అలాంటి ధోనీ ఇకపై సారథిగా కనిపించడంటే చెన్నై ఫ్యాన్స్ కు చేదువార్తగానే చెప్పాలి. అయితే ధోనీ కెప్టెన్సీ రికార్డులు చూస్తే మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే. ఐపీఎల్ చరిత్రలో మరే సారథిగా సాధ్యంకాని రికార్డులు అతని సొంతం

ఐపీఎల్ అరంగేట్రం సీజన్ నుంచి ఇప్పటి వరకూ రెండు జట్లకు సారథిగా వ్యవహరించాడు. 2008 నుంచి 2023 మధ్య చెన్నై సూపర్ కింగ్స్ ను 212 మ్యాచ్ లలో సారథిగా నడిపించాడు. ధోనీ కెప్టెన్సీలో చెన్నై 128 మ్యాచ్ లు గెలవగా..82మ్యాచ్ లలో ఓడిపోయింది. 2 మ్యాచ్ లలో ఫలితం తేలలేదు. అలాగే చెన్నై జట్టును నిషేధించినప్పుడు పూణే సూపర్ జెయింట్స్ కు కెప్టెన్ గా ఉన్న ధోనీ 14 మ్యాచ్ లలో ఐదింటిలో గెలిపించగా.. 9 మ్యాచ్ లలో ఓటమిని చవిచూశాడు. ఓవరాల్ గా ఐపీఎల్ లో ధోనీ కెప్టెన్సీ విన్నింగ్ రికార్డు 60 శాతంగా ఉంది. మోస్ట్ సక్సెస్ ఫుల్ కెప్టెన్ల జాబితాలో ధోనీనే అగ్రస్థానంలో ఉండగా… తర్వాతి స్థానాల్లో రోహిత్ శర్మ, కోహ్లీ ఉన్నారు. ధోనీ సారథ్యంలోనే చెన్నై సూపర్ కింగ్స్ ఐదు సార్లు ఛాంపియన్ గా నిలిచింది. సారథిగా కాకున్నా మహి మ్యాజిక్ ఎప్పుడూ చెన్నై వెంటే ఉంటుందని ఫ్యాన్స్ చెబుతున్నారు.

Also Read: Hyderabad: హైదరాబాద్ లో  పార్కింగ్ కోసం మొబైల్ యాప్ సేవలు