Site icon HashtagU Telugu

Dhoni Viral Video: జిమ్ లో ధోనీ .. వైరల్ అవుతున్న వీడియో

Dhoni Viral Video

New Web Story Copy (92)

Dhoni Viral Video: గత ఐపీఎల్ సీజన్లో ఐపీఎల్ టైటిల్ కొట్టి ఐపీఎల్ లో ముంబై రికార్డుని సమం చేసి చెన్నైకి ఐదో టైటిల్ అందించాడు ధోని. ఆటకు విరామం ఇచ్చిన ధోనీ సరదాగా గడిపే ప్రతిక్షణాన్ని సద్వినియోగం చేసుకుంటున్నాడు. మైదానంలో ప్రత్యర్థుల్ని తన మేధాశక్తితో మాయచేసి మాహీ బయట మాత్రం జోయల్ గా కనిపిస్తాడు. ఈ మధ్య ధోనీకి సంబంధించిన ప్రతి వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. తాజాగా ధోనీకి సంబంధించి మరో వీడియో బయటకు వచ్చింది. మహీని అలా చూసి ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు.

ధోనీ తన జిమ్ కొలీగ్స్ తో పార్టీ చేసుకున్నాడు. సహచరుల మధ్య ధోనీ కేక్ కట్ చేసి సరదాగా గడిపాడు. కేక్ ఎవరో తింటున్నారో ఎవరు డైట్ చేస్తున్నారో చెప్పాలి అంటూ కామెడీ చేశాడు. ఇండియన్ ప్రియర్ లీగ్ లో అత్యంత విజయవంతమైన జట్టుగా చెన్నై ఐదు సార్లు కప్ గెలుచుకున్న సందర్భంగా రాంచీలో ధోనీ తన జిమ్ ఫ్రెండ్స్ తో ఇలా కేక్ కట్ చేసి ఎంజాయ్ చేసినట్టు తెలుస్తుంది.

Also Read: T Congress : ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ ప్రకటించిన తెలంగాణ కాంగ్రెస్.. ప్రధాన అంశాలివే..