Site icon HashtagU Telugu

Dhoni Cried: కన్నీరు పెట్టుకున్న ధోని

Dhoni Cried

New Web Story Copy 2023 05 23t184441.453

Dhoni Cried: మిస్టర్ కూల్ గా పిలవబడే జార్ఖండ్ డైనమేట్ మహేంద్ర సింగ్ ధోని ఈ ఐపీఎల్ సీజన్ లో సత్తా చాటుతున్నాడు. చివర్లో వచ్చి ఆడిన రెండు మూడు బంతులే అయినప్పటికీ బౌండరీలతో ఆకట్టుకుంటున్నాడు. ఇక ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ ధోనికి చివరి సీజన్ అన్న వార్తలు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో చెన్నై ఫ్యాన్స్ ధోని ఆడే ఏ ఒక్క మ్యాచ్ ని వదలడం లేదు. ధోని ఆట కోసం మైదానానికి బారులు తీరుతున్నారు. ప్రస్తుతం చెన్నై అన్ని దాటుకుని ప్లే ఆఫ్ బెర్త్ కన్ఫర్మ్ చేసుకుంది. అయితే ఎప్పుడూ కూల్ గా ఉంటూ, ఎంత కష్టమొచ్చినా భావోద్వేగానికి గురి కాని ధోని ఒకానొక సమయంలో కన్నీరు పెట్టుకున్నాడట.

ఓ క్రీడా ఛానెల్ కార్యక్రమంలో పాల్గొన్న చెన్నై సూపర్ కింగ్స్ మాజీ ఆటగాళ్లు హర్భజన్, ఇమ్రాన్ తాహీర్ ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు ఎదుర్కొన్న చెన్నై సూపర్ కింగ్స్ రెండేళ్ల నిషేధం తరువాత 2018లో ఐపీఎల్ లోకి రీ ఎంట్రీ ఇచ్చింది. ఆ రోజు టీమ్ డిన్నర్ సమయంలో మహేంద్ర సింగ్ ధోనీ కన్నీళ్లు పెట్టుకున్నారని, ఆ రోజు మాహీ చాలా భావోద్వేగానికి గురయ్యాడని హర్భజన్ గుర్తు చేసుకున్నాడు. దానికి తాహీర్ స్పందిస్తూ అవును నిజమే ధోనీ ఆ రోజు రాత్రి కన్నీళ్లు పెట్టుకున్నట్టు ఎవరికీ తెలియదని చెప్పాడు.

తాహీర్ మాట్లాడుతూ.. చెన్నై సూపర్ కింగ్స్ జట్టుని ధోనీ సొంత కుటుంబంలా భావిస్తాడు. చెన్నై విషయంలో ధోని భావోద్వేగానికి లోనవుతాడు. ధోని ఏడ్చిన సందర్భం నాకింకా గుర్తుందని, ధోని అలా ఏడ్చినప్పుడు చెన్నై తన హృదయానికి ఎంత దగ్గరగా ఉందో అప్పుడు తెలిసిందని తాహీర్ గుర్తు చేసుకున్నాడు. రెండేళ్ల నిషేధం తరువాత 2018లో ఐపీఎల్ రీ ఎంట్రీ ఇచ్చినప్పుడు చెన్నై జట్టుపై అనేక విమర్శలు చేశారని, డాడీస్ ఆర్మీ అని, వృద్ధుల జట్టుగా పిలిచారని అన్నారు. అయితే అప్పుడు మేము కప్ కొట్టి చూపించమని తెలిపారు తాహీర్.

Read More: IPL 2023 Playoffs Schedule: నేటి నుంచి ఐపీఎల్ 2023 ప్లేఆఫ్స్‌.. పూర్తి షెడ్యూల్, ప్రత్యక్ష ప్రసార వివరాలివే..!