Site icon HashtagU Telugu

MS Dhoni: టీమిండియా జట్టులోకి ధోనీ?

MS Dhoni

New Web Story Copy 2023 06 06t152353.464

MS Dhoni: టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ టీమిండియా జట్టుకు దూరమై మూడేళ్లు అవుతుంది. 2020 లో ధోనీ రిటైర్మెంట్ ప్రకటిస్తూ నిర్ణయం తీసుకున్నాడు. ధోనీ రిటైర్మెంట్ తో యావత్ క్రికెట్ ప్రపంచం ఆశ్చర్యానికి గురైంది. హఠాత్తుగా తాను రిటైర్మెంట్ ప్రకటించాల్సిన అవసరం ఏముంది అంటూ అయోమయంలో పడ్డారు. కెప్టెన్ కూల్ గా టీమిండియాకు ధోనీ చేసిన సేవ చిరస్మరణీయం.

ప్రస్తుతం ధోనీ వన్డే, టీ20, టెస్టు ఫార్మేట్లకు దూరమయ్యాడు. అయితే ఐపీఎల్ లో ధోనీ సత్తా చాటుతున్నాడు. నాలుగు పదుల వయసులోనూ తెనేంటో ప్రూవ్ చేసుకుంటూనే ఉన్నాడు. చెన్నై సూపర్ కింగ్స్ కు సారథ్యం వహిస్తున్న ధోనీ ఐదు ఐపీఎల్ ట్రోపీలను అందించాడు. ఇక ఈ సీజన్ 2023లో ధోనీ ప్రత్యేకమనే చెప్పాలి. 2023 ధోనీకి చివరి ఐపీఎల్ అనుకున్నారందరూ. కానీ ధోనీ ప్రదర్శన చూస్తుంటే మరో రెండేళ్ళైనా ఆడే సామర్ధ్యం ధోనీలో ఉందని నిరూపించాడు.

ధోనీ ప్రపంచ క్రికెటర్లకు ఆదర్శంగా నిలిచాడు. విదేశీ క్రికెటర్లు ధోనీ ఆటోగ్రాఫ్ తీసుకోవడం అతని ప్రతిభను తెలియజేసింది. ఇదిలా ఉండగా తాజాగా పాకిస్థాన్ మాజీ కెప్టెన్ ధోనీ గురించి ఆసక్తికర అంశాన్ని లేవనెత్తారు. పాకిస్థాన్ మాజీ కెప్టెన్ వసీమ్ అక్రమ్ తాజాగా మాట్లాడుతూ… ధోనీ ఆడాలి అనుకుంటే మళ్ళి టీమిండియాకు ఆడొచ్చని ఆసక్తికర అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ధోనీలో ఆ సత్తా ఉంది. ధోనీ తన క్రికెట్ కు సరైన సమయంలో వీడ్కోలు పలికాడు. ఇక ఇటీవల ధోనీ ఐపీఎల్ లో అదరగొట్టాడు. వచ్చే ఐపీఎల్ సమయానికి ధోనీ మరింత బలంగా కనిపిస్తాడు. ధోనీ ఫిట్నెస్ పై ఎవరికీ అనుమానం అవసరం లేదు. తాను కావాల్సినంత ఫిట్ గా ఉన్నాడు. వచ్చే ఐపీఎల్ లో ధోనీ కుర్రాళ్లకు పోటీ ఇస్తాడని అభిప్రాయం వ్యక్తం చేశాడు వసీమ్ అక్రమ్. అంతేకాకుండా ధోనీలో ఇంకా ఆడాలి అనే కోరిక బలంగా కనిపిస్తుందని చెప్పారు అక్రమ్.

Read More: Asia Cup: ఆసియా కప్ టోర్నీకి పాకిస్థాన్ డౌటే.. హైబ్రిడ్ మోడల్‌ను తిరస్కరించిన మరో మూడు దేశాలు..!