Site icon HashtagU Telugu

No Retirement For Dhoni: వచ్చే సీజన్ లో ఆడతాడా?లేదా?మిస్టర్ కూల్ ఏం చెప్పాడో తెలుసా..?

Dhoni As Uncapped Player

Dhoni As Uncapped Player

IPL 2022 సీజన్ ఫైనల్ కు చేరుకుంది. ఈ లీగ్ టోర్నీలో చెన్నై సూపర్ కింగ్స్ లాస్ట్ లీగ్ మ్యాచ్…ఎంఎస్ ధోనీ చెన్నై కెప్టెన్. అయితే వచ్చే ఐపీఎల్ లో ధోనీ ఆడుతాడా లేదా అనేది ప్రశ్న. ధోనీ IPL 2023 టోర్నీలో ఆడేది లేదని క్లారిటీ ఇచ్చాడు. రాజస్థాన్ తో మ్యాచ్ సమయంలో ధోనీ తన మనసులో మాటను వెల్లడించాడు.

టాస్ వేసే సందర్భంలో ధోనీ వచ్చే సీజన్ లో ఆడాలా లేదా అనేదానిపై స్పందించాడు. తాను ఇంకా ఏం అనుకోలేదని స్పష్టం చేశాడు. ఐపీఎల్ 2023 సీజన్ కూడా ఆడేందుకు ప్రయత్నిస్తానని చెప్పాడు. ఐపీఎల్ ఏ జట్టు అంటే  ఎక్కువగా ఇష్టమంటే..ముంబై జట్టు అంటే వ్యక్తిగతంగా చాలా ఇష్టమని చెప్పుకొచ్చాడు.

తాను వచ్చే సీజన్ లో ఆడతానా లేదా అనేది ఇప్పుడే అంచనా వేయలేం అని చెప్పాడు. లేదంటే ఆడేందుకు తన వంతు ప్రయత్నం చేస్తానని చెప్పాడు. 2019లో అంతర్జాతీయ క్రికెట్ కు మిస్టర్ కూల్ వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ధోనీ టీ 20 లీగ్ కు మాత్రమే పరిమితం అయ్యారు. ఈ సీజన్ సమయానికి ధోనీ తప్పుకుంటాడని అనుకున్నారు. కానీ అందరి అనుమానాలను పటాపంచలు చేస్తూ…తొలి మ్యాచ్ లోనే హాఫ్ సెంచరీ చేశాడు. చెన్నై ఓడినా ధోనీ మాత్రం తనదైన స్టైల్లో రాణించాడు.